Widgets Magazine Widgets Magazine

మహానాడుకు రాని ఎన్టీఆర్ కుటుంబీకులు.. పార్టీ శ్రేణుల్లో మొదలైన చర్చ?

సోమవారం, 29 మే 2017 (09:08 IST)

Widgets Magazine

మహానాడుకు టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ కుటుంబీకులు ఎవ్వరూ హాజరు కాలేదు. తద్వారా ఏపీ సీఎం చంద్రబాబుకు ఎన్టీఆర్ ఫ్యామిలీ షాక్ ఇచ్చారని రాజకీయ పండితులు అంటున్నారు. ప్రతీ ఏడాది మేలోసతెలుగుదేశంపార్టీ మహానాడు నిర్వహిస్తుంది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జన్మదినమైన మే 28న మహానాడు జరుగుతుంది. ఇది ఆరంభం నుంచి వస్తున్న ఆనవాయితీ. ఈ మహానాడుకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు తప్పక హాజరవుతుంటారు. కానీ ఈ ఏడాది మాత్రం ఎన్టీఆర్ కుటుంబ సభ్యులెవరూ మహానాడుకు హాజరు కాలేదు.   
 
ఎన్టీఆర్ కుటుంబం నుంచి మహానాడుకు తప్పకుండా హాజరయ్యే హరికృష్ణ కూడా ఈసారి మహానాడు రాలేదు. ఇక మరో కుమారుడు నందమూరి బాలకృష్ణ ఏకంగా తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నా మహానాడుకు మాత్రం ఈసారి హాజరుకాలేదు. బాలయ్య మాత్రం తాను విదేశాల్లో సినిమా షూటింగ్ లో ఉన్నందువల్ల రాలేకపోయానని వివరణ ఇచ్చుకున్నారు.
 
గతంలో మహానాడుకు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ , తారకరత్న వచ్చేవారు. రెండు, మూడేళ్లుగా జూనియర్ ఎన్టీఆర్ మహానాడుకు రావడం మానేశారు. దీంతో పార్టీ శ్రేణుల్లో చర్చ మొదలైంది. చంద్రబాబు ఎన్టీఆర్ కుటుంబాన్ని పక్కనబెట్టేందుకు రంగం  సిద్ధం చేస్తున్నారా? అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మాహిష్మతి రాజ్యాన్ని అంత భారీగా ఎందుకు నిర్మించాం.. ఇతర రాజులు, దూతలను భయపెట్టాలనే: రాజమౌళి

బాహుబలి-2 చిత్రంలో మాహిష్మతి రాజ్యం ఎంత పెద్దదంటే ఇంతవరకు భారతీయ చిత్ర రంగంలోని ఏ సినిమా ...

news

నైరుతి రుతుపవనం ముందుగా వస్తోందంటే ప్రమాదమేనా... తర్వాత కరువు తప్పదా

మండువేసవిలో మలయమారుతం చల్లగా తాకితే వచ్చే ఆ సంతోషానుభూతిని మాటల్లో వర్ణించలేము. ఉక్కపోతతో ...

news

కుక్కల గుంపును ఇలా బెదరగొట్టి తరమాలి అని సినిమా చూపించిన పిల్లగాడు

ఉన్నట్లుండి మీమీదికి కుక్కల గుంపు ఒకటి వచ్చి ఎగాదిగా చూస్తే పెద్దవాళ్లకు సైతం ...

news

నందమూరి వంశీయులు లేకుండా తొలి మహానాడు.. అధినేతపై అటూ ఇటూ అసంతృప్తి

తెలుగుదేశం పార్టీ విశాఖపట్నంలో గత రెండు రోజులుగా నిర్వహించిన మహానాడు షరామామూలుగానే ...