గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 30 ఆగస్టు 2017 (17:36 IST)

నంద్యాల ప్రజలు జగన్ బట్టలూడదీశారు... మంత్రి పత్తిపాటి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డికి నంద్యాల ప్రజలు బుద్ధి చెప్పారనీ, ఆయన బట్టలూడదీశారంటూ సెటైర్లు వేశారు ఏపీ మంత్రి పత్తిపాటి పుల్లారావు. మీడియాతో ఆయన మాట్లాడుతూ... నంద్యాల ప్రజలు జగన్ మోహన్ రెడ్డికి అవాకులు చెవాకులు పేలితే ఏం జరుగుతు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డికి నంద్యాల ప్రజలు బుద్ధి చెప్పారనీ, ఆయన బట్టలూడదీశారంటూ సెటైర్లు వేశారు ఏపీ మంత్రి పత్తిపాటి పుల్లారావు. మీడియాతో ఆయన మాట్లాడుతూ... నంద్యాల ప్రజలు జగన్ మోహన్ రెడ్డికి అవాకులు చెవాకులు పేలితే ఏం జరుగుతుందో తెలియజేశారని అన్నారు.
 
కాకినాడలో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్‌కే పరిమితం అవుతుందనీ, తెదేపా-భాజపా కలిసి 30కి పైగా స్థానాలను సాధిస్తాయని జోస్యం చెప్పారు. 20 ఏళ్ల తర్వాత కాకినాడలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురబోతోందని జోస్యం చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో పరాభవం తప్పదని అన్నారు.