కేసీఆర్ సాబ్.. అంత పెద్ద టాస్క్ ఎలా సాధ్యమైంది? : జనసేనాని ప్రశ్న

మంగళవారం, 2 జనవరి 2018 (08:38 IST)

రాష్ట్రంలోని రైతాంగాన్ని అదుకునేందుకు వీలుగా జనవరి ఒకటో తేదీ నుంచి 24 గంటల పాటు ఉచిత కరెంట్ సఫరా చేయాలన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్వాగతించారు. ఇంత పెద్ద టాస్క్ ఎలా సాధ్యమైందంటూ పవన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
pk - kcr
 
కాగా, కొత్త సంవత్సరం సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపేందుకు సోమవారం పవన్ కళ్యాణ్ ప్రగతి భవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా వారిద్దరూ అర్థగంటపాటు ఏకాంతంగా సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, 'తెలంగాణలో నాకు అభిమానులున్నారు. నా బలం నాకు ఉంది. సీఎం కేసీఆర్ సారథ్యంలోని తెరాస ప్రభుత్వం బాగా పనిచేస్తోందని నేను నా అభిమానులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు' అని వ్యాఖ్యానించారు. 
 
'రాష్ట్రం విడిపోతే తెలంగాణ అంధకారం అలముకుంటుందని నాడు కొందరన్నారు. కానీ, నేడు 24 గంటల పాటు నిరంతరాయంగా రైతులకు విద్యుత్తు అందిస్తున్నారు. పొద్దున పత్రికల్లో చూస్తే ఆశ్చర్యమేసింది. అంతపెద్ద టాస్క్‌ ఎలా సాధ్యమైందో తెలుసుకుందామనే సీఎం కేసీఆర్‌ని కలిసేందుకు వచ్చా'  అని పవన్‌ చెప్పారు. అసాధ్యం అనుకున్న ఎన్నో అంశాలను సీఎం కేసీఆర్‌ సుసాధ్యం చేస్తున్నారని కొనియాడారు.
 
కేసీఆర్‌ పాలనా సామర్థ్యాన్ని తెలుసుకునేందుకే తాను ప్రగతిభవన్‌కి వచ్చానన్నారు. జనసేన ఆవిర్భావం సందర్భంగా పవన్‌ రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా భేటీపై పలు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఇరువురి మధ్య ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. 24 గంటల విద్యుత్తు సరఫరాపై అడగ్గా.. సీఎం కేసీఆర్‌ గణాంకాలతో సహా పవన్‌కి వివరించారు. దీనిపై మరింత చదవండి :  
Kcr Telangana Farmers Free Power Pawan Kalyan

Loading comments ...

తెలుగు వార్తలు

news

బ్రెడ్ అంటేనే మనకు మనసు డెడ్.. చింతకాయ పచ్చడిని: వెంకయ్య

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వాక్చాతుర్యం కలిగిన వారు. వేదికపై ఆయన ప్రసంగం చేస్తే.. అందరూ ...

news

చలికాచుకుందామని కూర్చుంటే కారు దూసుకెళ్లింది.. ఐదుగురు మృతి

అసలే చలికాలం. చలిమంట కాచుకుందామని ఓ నలుగురు మంటల ముందు కూర్చున్నారు. అంతే వారిపై అదుపు ...

news

రెచ్చగొడితే మాత్రం రాజకీయాల్లో వస్తా: ప్రకాష్ రాజ్ ప్రకటన

సినీ తారలు రాజకీయాల్లోకి రావడం ఫ్యాషనైపోయింది. నిన్న సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లో ...

news

నా టేబుల్ మీద న్యూక్లియర్ బటన్ ఉంటుంది: కిమ్ జాంగ్

ప్రపంచ దేశాలను అణు పరీక్షలతో వణికిస్తున్న ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ కొత్త ...