1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 29 జనవరి 2018 (15:00 IST)

మీరు అరిస్తే... కేకలు వేస్తే నాకే అవమానం : పవన్ కళ్యాణ్

అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం ధర్మవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన చేనేత కార్మిక కుటుంబాలతో సమావేమయ్యారు. ఆ తర్వాత నేత కార్మిక సమస్యలపై మాట్లాడేందుకు పవన్

అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం ధర్మవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన చేనేత కార్మిక కుటుంబాలతో సమావేమయ్యారు. ఆ తర్వాత నేత కార్మిక సమస్యలపై మాట్లాడేందుకు పవన్ ముందుకు వచ్చారు. అపుడు అభిమానుల కేకలు, అరుపులతో సభాప్రాంగణం దద్ధరిల్లిపోయింది. అపుడు పవన్ కల్పించుకుని మీరు చెప్పేది వినాలని, మీరు అరిస్తే అది నాకు అవమానమన్నారు. మన ఇంట్లో ఎవరైనా చనిపోతే మనం అరుస్తామా అంటూ ప్రశ్నించారు. అందువల్ల దయచేసి తాను చెప్పింది వినాలని ఆయన అభిమానులకి విజ్ఞప్తి చేశారు. 
 
అంతకుముందు పవన్‌కు ఓ అభిమాని ‘అజ్ఞాతవాసి’ చిత్రంతో రూపొందించిన పట్టువస్త్రాన్ని పవన్‌కు బహూకరించారు. ఆ వస్త్రాన్ని పరిశీలించిన పవన్ వాళ్లను మెచ్చుకున్నారు. ధర్మవరం చేనేత కార్మికుల నైపుణ్యాన్ని ప్రపంచం దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని పవన్ మాటిచ్చారు. కార్మికుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తానని, చేనేత కళ అంతరించి పోకుండా చూస్తానని, చేనేత కార్మికులెవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని పవన్ కళ్యాణ్ కోరారు.