Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కొండగట్టులో పడిపోయిన పవన్ కళ్యాణ్‌... మోకాళ్ళకు గాయాలు..

సోమవారం, 22 జనవరి 2018 (16:56 IST)

Widgets Magazine

మొక్కు తీర్చుకోవడానికి తెలంగాణా రాష్ట్రం జగిత్యాలకు సమీపంలోని కొండగట్టు ఆంజనేయ స్వామివారి ఆలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్‌‌కు అభిమానుల నుంచి ఇబ్బందులు తప్పలేదు. ఒక్కసారిగా పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు వచ్చిన అభిమానులు పవన్‌ను కిందకు తోసేశారు. కారు దిగి కొండగట్టు ఆలయంలోకి వెళుతుండగా అభిమానులు తోసుకుని తమ అభిమాన హీరోపై పడిపోయారు. దీంతో పవన్ కళ్యాణ్‌ కూడా కిందపడిపోయారు.
pawan kalyan
 
ఈ కారణంగా ఆయన కాలికి గాయమైంది. అయితే పక్కనే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది పవన్‌ను పైకి లేపారు. మోకాళ్ళ కింద పవన్‌కు రక్తస్రావమైంది. కానీ పవన్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా పైకి లేచి ఆలయంలోకి వెళ్ళి మొక్కు తీర్చుకున్నారు. అభిమానుల అత్యుత్సాహం వల్లే పవన్‌కు గాయమైందని సెక్యూరిటీ సిబ్బంది అంటున్నారు. కాగా, పవన్ రాకను తెలుసుకున్న వేలాదిమంది అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు కొండగట్టుకు చేరుకున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇంటిలో చోరీ...

వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇంట్లో చోరీ జరిగింది. హైదరాబాద్‌లోని మడికొండలో రోజా నివాసముంటోంది. ...

news

ఆడపిల్లలు ఎక్కువగా తండ్రిని ఎందుకు ప్రేమిస్తారో తెలుసా...?

ప్రతి తండ్రికి తన కూతురే బంగారం. కొన్నికొన్నిసార్లు తన భార్య మీద చూపే ప్రేమకంటే కూతురిపైన ...

news

రాజ్యాంగ ప్రతులెన్ని వున్నాయి? 26నే ఎందుకు జరుపుకోవాలి?

భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య దేశంగా తీర్చిదిద్దేందుకు గణతంత్ర ...

news

రాజ్యాంగ రూప కల్పన: అమెరికా నుంచి ఆ మూడు తీసుకున్నారు..

స్వాతంత్ర్య భారత రాజ్యాంగ నిర్మాణం జరిగిన రోజునే గణతంత్ర వేడుకగా జరుపుకుంటున్నాం. 1949 ...

Widgets Magazine