Widgets Magazine

''సావిత్రి'' బాటలో కీర్తి సురేష్.. యూనిట్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చింది.. ఎలా?

సోమవారం, 22 జనవరి 2018 (15:52 IST)

mahanati

కీర్తి సురేష్ ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్‌లో అధికంగా వినిపిస్తున్న హీరోయిన్ పేరు. ఈమె నటించిన సినిమాలు హిట్ కాకపోయినా.. కీర్తి నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. తాజాగా తెలుగులో పవర్ స్టార్ పవన్ సరసన ''అజ్ఞాతవాసి''లో నటించిన కీర్తి సురేష్.. మరోవైపు అలనాటి అందాల తార 'సావిత్రి' జీవిత కథ ఆధారంగా తెరకెక్కే 'మహానటి' చిత్రంలోనూ నటిస్తోంది.
 
ఇందులో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో కనిపిస్తోంది. 'ఎవడే సుబ్రమణ్యం' ఫేం నాగ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఈ నేపథ్యంలో కీర్తి సురేష్‌ ఈ చిత్ర యూనిట్ సభ్యులందరికీ స్వీట్‌ సర్‌ ప్రైజ్‌ ఇచ్చింది. మహానటి సావిత్రి నటిగా ఉన్న కాలంలో తన సినిమాకు పని చేసిన వారికి బహుమతులు ఇవ్వడం అలవాటు.
 
అదే అలవాటును సావిత్రి పాత్రలో నటిస్తున్న కీర్తి సురేష్ కొనసాగించింది. 'మహానటి' సినిమాకు పనిచేసిన యూనిట్‌ సభ్యులకు బంగారు నాణేలను కీర్తి కానుకగా ఇచ్చింది. కీర్తి ఇచ్చిన స్వీట్‌ సర్‌‌ప్రైజ్‌‌తో యూనిట్‌ సభ్యులు షాక్ అయ్యారు.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఏ యాంగిల్ అయినా చేయగలను... మిల్కీ బ్యూటీ తమన్నా..

సినిమా పరంగా నేను ఏదైనా చేయగలనన్న నమ్మకం నాలో ఏర్పడింది. ఖచ్చితంగా చేస్తాను అన్న ధీమా మా ...

news

మహేష్ బాబు 'పోకిరి' చిత్రం ఫ్లాపే : రాంగోపాల్ వర్మ

వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ...

news

'పద్మావత్' విడుదలను ఆపాలంటూ థియేటర్లపై దాడులు

బాలీవుడ్ దర్శకదిగ్గజం సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన చిత్రం పద్మావత్. ఈ చిత్రం ఈనెల 25వ ...

news

పబ్‌లో పూరీతో కలిసి డాన్స్ చేస్తున్న చార్మీ (వీడియో)

పంజాబీ ముద్దుగుమ్మ, టాలీవుడ్ హీరోయిన్ ఛార్మి. ఒక‌ప్పుడు స్టార్ హీరోల స‌ర‌స‌న క‌థానాయిక‌గా ...

Widgets Magazine