శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 24 జులై 2015 (16:08 IST)

పుష్కరాల్లో 4.5 కోట్ల మందికి పైగా స్నానాలు చేశారు: పీతల సుజాత

ఆంధ్రప్రదేశ్‌లో 5 కోట్లకు పైగా ప్రజలుండగా, ఇప్పటివరకూ 3.5 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు చేసినట్టు ఏపీ మంత్రి పీతల సుజాత తెలిపారు. మొత్తం నాలుగున్నర కోట్ల మందికి పైగా స్నానాలు చేశారని, వీరిలో ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తుల సంఖ్య కోటికి దగ్గరగా ఉందని చెప్పారు. పుష్కరాలు జూలై 25తో ముగియనున్న నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాలకు యాత్రికుల తాకిడి ఎక్కువవుతోంది. 
 
ప్రత్యేక రైళ్లతో పాటు దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లు కిక్కిరిసిన ప్రయాణీకులతో గంటల కొద్దీ ఆలస్యంగా నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 5 కోట్లకు పైగా ప్రజలుండగా, ఇప్పటివరకూ 3.5 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు చేసినట్టు ఏపీ మంత్రి పీతల సుజాత వివరించారు. 
 
మొత్తం నాలుగున్నర కోట్ల మందికి పైగా స్నానాలు చేశారని, వీరిలో ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తుల సంఖ్య కోటికి దగ్గరగా ఉందని తెలిపారు. రాజమండ్రి నుంచి అంతర్వేది వరకూ ఉన్న దేవాలయాలతో పాటు అన్నవరం సత్యనారాయణస్వామి, బెజవాడ కనకదుర్గమ్మ దేవాలయాల్లో వేలాది సంఖ్యలో భక్తులు దర్శనం కోసం వేచి చూస్తున్నట్టు తెలుస్తోంది.