శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 31 జులై 2014 (13:35 IST)

పోలవరం ఆర్డినెన్స్ ఓకే : గిరిజన జిల్లా ఏర్పాటుకు అంగీకారం!

పోలవరం ప్రాజెక్టు ఆర్డినెన్స్‌కు ఆమోదం లభించిన నేపథ్యంలో గిరిజన జిల్లా ఏర్పాటుకు అంగీకారం లభించింది. ఖమ్మం జిల్లా నుంచి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొత్తగా కలిసిన ముంపు మండలాలతో కలిపి గిరిజన ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేయడానికి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత ప్రజాప్రతినిధులు అంగీకారం తెలిపారు. 
 
అయితే, పోలవరం కేంద్రంగా గిరి జన జిల్లాను ఏర్పాటు చేయాలని కోరారు. ప్రత్యేక గిరిజన జిల్లా అంశంపై కలెక్టర్ కాటమనేని భాస్కర్ ఆధ్వర్యంలో బుధవారం అభిప్రాయ సేకరణ జరిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కాటమనేని భాస్కర్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన ఏడు మండలాలతోపాటు, ఉభయగోదావరి జిల్లాలోని 13 ఏజెన్సీ మండలాలను కలిపి 20 మండలాలతో ప్రత్యేక గిరిజన జిల్లా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు. దీనిలో భాగంగా ఆయా మండలాల్లో నివసిస్తున్న ప్రజాప్రతినిధుల నుంచి అభిప్రాయాలను సేకరించాలని ఆదేశించిందన్నారు.
 
ఆర్డినెన్స్ ద్వారా జంగారెడ్డిగూడెం డివిజన్‌లో కలిసిన బూర్గం పాడు పరిధిలోని ఆరు గ్రామాలను కుకునూరు మండలంలో కలిపారని వెల్లడించారు. కుకునూరు, వేలేరుపాడు మండలాల్ని కేఆర్‌పురం ఐటీడీఏలో కలిపే ఆలోచన ఉందని తెలి పారు. ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని, జిల్లా కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయూలన్నది ప్రభుత్వ నిర్ణయం మేరకే ఉంటుందని చెప్పారు.