నంద్యాల బైపోల్‌పై 'ఆంధ్రా ఆక్టోపస్' లగడపాటి జోస్యం.. ఎవరిది గెలుపు?

గురువారం, 10 ఆగస్టు 2017 (14:03 IST)

lagadapati

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను నంద్యాల ఉప ఎన్నిక హీటెక్కించింది. ఈ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన భూమా నాగిరెడ్డి హఠాన్మరణంతో ఇక్కడ బైపోల్ అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఈ స్థానానికి ఈసీ నోటిఫికేషన్ జారీ చేయగా, వైకాపా తరపున శిల్పా మోహన్ రెడ్డి, టీడీపీ తరపున భూమా నాగిరెడ్డి తనయుడు భూమా బ్రహ్మానంద రెడ్డి బరిలో నిలిచారు. 
 
ఈ స్థానంలో గెలుపొందాలని టీడీపీ నేతలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం ఆయన మంత్రులందరితో ప్రచారం చేయిస్తూ తాను కూడా రంగంలోకి దూకారు. మరోవైపు.. వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి సైతం ఈ స్థానంలో స్వయంగా తమ పార్టీ అభ్యర్థికి ప్రచారం చేస్తున్నారు. దీంతో ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. 
 
ఈనేపథ్యంలో నంద్యాల ఉప ఎన్నిక ఫలితంపై ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరుగడించిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ జోస్యంచెప్పారు. నంద్యాలలో జగన్ మోహన్ రెడ్డి ఉప ఎన్నికల ప్రచారం కోసం నిర్వహించిన తొలి బహిరంగ సభకు ముందు విజయావకాశాలు ఇరు పక్షాలను దోబూచులాడాయన్నారు. 
 
ఈ బహిరంగ సభ తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిందన్నారు. ప్రస్తుతం వైకాపాకు 61 శాతం, టీడీపీకి 32 శాతం మేరకు విజయావకాశాలు ఉన్నట్టు లగడపాటి రాజగోపాల్ వెల్లడించారు. సాధారణంగా ప్రతి ఎన్నికలపై లగడపాటి సర్వే చేయించి, ఫలితాలను వెల్లడించడం ఆనవాయితీగా వస్తోంది. పైగా, ఈ ఫలితాలకు వాస్తవ ఫలితాలకు ఎంతో దగ్గరిగా ఉంటాయి. దీంతో నంద్యాల ఉప ఎన్నిక ఫలితం కూడా ఆయన చెప్పినట్టే వస్తుందన్న ధీమాతో వైకాపా శ్రేణులు ఇపుడే సంబరాలు జరుపుకుంటున్నాయి. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రజినీ రాజకీయ సలహాదారుగా ధనుష్‌... వణుకుతున్న పన్నీర్, పళని

రజినీకాంత్ వెంట నడవడానికి తమిళనాడులో రాజకీయ పార్టీల నేతలందరూ సిద్థమవుతుంటే కుటుంబ ...

news

శశికళ, దినకరన్‌కు షాక్‌.. పార్టీ నుంచి గెంటివేత?... పళనిస్వామి తీర్మానం

తమిళనాడు అధికార అన్నాడీఎంకే పార్టీ రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. అన్నాడీఎంకే ...

news

అమరావతిలో అకృత్యాలు: డ్రగ్స్, మందు, పబ్లిక్ రొమాన్స్, పార్టీలు...?

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతిలో డ్రగ్స్, బహిరంగ శృంగారం వంటి ...

news

ఖతార్‌కు ఇక వీసా లేకుండా వెళ్ళొచ్చు తెలుసా?

సౌదీ అరేబియాతో పాటు ఏడు దేశాలు ఖతార్ దేశంలో సంబంధాలను తెగతెంపులు చేసుకున్న నేపథ్యంలో.. ...