శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : సోమవారం, 21 సెప్టెంబరు 2015 (08:57 IST)

చవితి ఉత్సవాలలో అక్కడ అంతా అశ్లీలమే.. అడ్డుకున్న పోలీసులపై దాడి.

అది వినాయక చవితిని పురస్కరించుకుని జరుగుతున్న ఉత్సవం. అయినా అక్కడి నిర్వాహకులకు అశ్లీలంపై మోజు పడిదింది. ఒకవైపు మహిళలు, చిన్నపిల్లలు వినాయకుడిని దర్శించుకోవడానికి వస్తుంటే మరోవైపు అశ్లీల నృత్యాలను ఏర్పాటు చేశారు. ఇది తప్పని అడ్డుకోవడానికి వెళ్ళిన పోలీసులపైనే దాడికి దిగారు. ప్రకాశం జిల్లాలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
ప్రకాశం, సింగరాయకొండ మండలం పాకలపల్లెపాలెంలో వినాయక చవితి సందర్భంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే అక్కడున్న యువత కొంత మంది దీనిని నిర్వహిస్తున్నారు. వారి బుద్ధి పెడదారిన పడింది. అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారు. రాత్రి పగలూ తేడా లేకుండా ఇదే పని చేస్తున్నారు. 
 
గ్రామంలో అశ్లీల నృత్యాలపై పలువురు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఆ గ్రామానికి చేరుకుని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే గ్రామానికి చెందిన కొందరు పోలీసులపైనే దాడికి దిగారు. హోంగార్డుకు గాయపరిచారు. వాహనాన్ని ధ్వంసం చేశారు. అదనపు బలగాలతో గ్రామానికి వచ్చిన పోలీసులు దాడి చేసిన వారిని వెంటనే అప్పగించాలని హెచ్చరికలు జారీ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.