ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 17 నవంబరు 2021 (12:51 IST)

మున్సిప‌ల్ ఖాతా తెరిచిన టీడీపీ... దర్శి దేశం కైవసం!

స్థానిక ఎన్నిక‌ల్లో టీడీపీ ఈ విడ‌త తొలి ఖాతా తెరిచింది. సొంతంగా ద‌ర్శి న‌గ‌ర పంచాయ‌తీని గెలుచుకోగ‌లిగింది. తాజాగా వ‌చ్చిన కౌంటింగ్ ఫ‌లితాల‌ను బ‌ట్టి, తెలుగుదేశానికి ఇక్క‌డ పూర్తి మెజారిటీ క‌నిపిస్తోంది. 
 
 
ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీని టీడీపీ సొంతంగా కైవసం చేసుకుంది. మొత్తం 20 వార్డులకు గాను ఒక వార్డులో ఏకగ్రీవం కాగా, 19 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఫలితాలు ప్రకటించిన 19 స్థానాలకు గాను 12 స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. 3, 4, 10, 12, 13, 14, 15, 17, 18, 19 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. అలాగే 1, 2, 5, 6, 7, 9 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు గెలిచారు. దర్శి నగర పంచాయతీలో టీడీపీ అభ్యర్థుల ఆధిక్యం స్పష్టంగా కనిపించింది.