శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శనివారం, 24 జూన్ 2017 (04:03 IST)

రాజీవ్ కాదు రాక్షసుడు.. నలుగురు అమ్మాయిలపై కన్నేసిన కాలనాగు

నమ్మిన వాళ్లను నట్టేట ముంచి వారి పోటోలతో మాంస వ్యాపారం చేసే నికృష్ట ఫోటో స్టూడియో యజమాని రాజీవ్ వల్లభనేని మనుషుల్లోని మృగాల్లోకెల్లా క్రూరమృగమని తెలుస్తోంది. హైదరాబాద్‌లో బ్యూటీషియన్‌ శిరీష ఆత్మహత్య ఘటనలో అరెస్టయిన ఆర్‌జే స్టూడియో యజమాని రాజీవ్‌ వల్ల

నమ్మిన వాళ్లను నట్టేట ముంచి వారి పోటోలతో మాంస వ్యాపారం చేసే నికృష్ట ఫోటో స్టూడియో యజమాని రాజీవ్ వల్లభనేని మనుషుల్లోని మృగాల్లోకెల్లా క్రూరమృగమని తెలుస్తోంది. హైదరాబాద్‌లో బ్యూటీషియన్‌ శిరీష ఆత్మహత్య ఘటనలో అరెస్టయిన ఆర్‌జే స్టూడియో యజమాని రాజీవ్‌ వల్లభనేని లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రాజీవ్‌.. శిరీష సహా నలుగురు యువతులతో సన్నిహితంగా ఉన్నట్లు, నెల క్రితం మరో యువతితో పరిచయం పెంచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ పరిచయం ప్రేమకు దారి తీసినట్లు సెల్‌ఫోన్‌ రికార్డులు వెల్లడిస్తున్నాయి. 
 
శిరీష కంటే ముందు ఇద్దరు యువతులతో ప్రేమాయణం సాగించిన రాజీవ్‌.. తర్వాత ఒక్కొక్కరినీ దూరంగా పెడుతూ వచ్చాడు. వారి అశ్లీల ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తానంటూ బెదిరించి వారి నుంచి తప్పించుకునేవాడు. ఇలా ఇద్దరిని మోసం చేసిన తర్వాత వివాహిత శిరీషను ప్రేమలో దింపాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
 
రాజీవ్‌ను ప్రేమించిన తేజస్విని ఒక వైపు పోలీసుస్టేషన్‌లో కేసు పెడతానని బెదిరిస్తూనే... విజయవాడ వెళ్లి అతడి తల్లిదండ్రులతో పెళ్లి విషయం మాట్లాడినట్లు విచారణలో తేలింది. దీంతో ఆమెను దూరంగా ఉంచాలని రాజీవ్‌ పథకం వేసినట్లు తెలుస్తోంది. ముందు శిరీషను దూరంగా ఉంచితే.. ఆ తర్వాత తేజస్వినిని కూడా పక్కకు తప్పించవచ్చని రాజీవ్‌ భావించినట్లు సమాచారం. 
 
యువతులతో సన్నిహితంగా ఉన్న సమయంలో వారికి తెలియకుండానే వీడియోలను తన ఫోన్‌లో చిత్రీకరించడం రాజీవ్‌కు అలవాటని దర్యాప్తులో తేలింది. అతడి ఫోన్‌ను పరిశీలించిన పోలీసులు అనేక వీడియోలు, ఫొటోలు గుర్తించి నిర్ఘాంతపోయారు. ఆర్‌జే ఫొటోగ్రఫీలో కొన్ని హార్డ్‌ డిస్క్‌లలోనూ అతడి రాసలీలలు బయటపడ్డాయి.