శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 2 ఆగస్టు 2015 (15:10 IST)

రిషితేశ్వరి ఆత్మహత్య కేసుపై సీబీఐ విచారణ జరిపించాలి : రాపోలు

గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బీఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసును సీబీఐతో విచారణ జరిపిస్తేనే నిజాలు బహిర్గతమవుతాయని తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ అభిప్రాయపడ్డారు.
 
ఈ కేసుపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ ఆయన ఆదివారం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి ఒక వినతిపత్రం సమర్పించారు. సీనియర్ల ర్యాగింగ్ వల్లే రిషితేశ్వరి బలవన్మరణానికి పాల్పడిందన్నారు. అందువల్ల ఈ కేసును సీబీఐతో విచారణ జరిపిస్తేనే, అసలు నిందితులు వెలుగులోకి వస్తారని స్పష్టంచేశారు. 
 
ఆమె మరణం వెనుక పరోక్షంగానైనా వర్శిటీలోని ఉన్నతాధికారుల ప్రమేయం ఉందని రాపోలు వివరించినట్టు సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న విచారణలతో న్యాయం జరగదని, తక్షణం కేసును సీబీఐకి అప్పగించాలని ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ డిమాండ్ చేశారు.