శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 31 జులై 2015 (16:19 IST)

నేడే బ్లూ మూన్.. ఆకాశంలో అద్భుతం...

నేడు ఆకాశంలో అద్భుత దృశ్యం కనిపించనుంది. సంవత్సరంలో 12 నెలలు. ఒక నెలలో ఒక పౌర్ణిమి మాత్రమే ఆకాశంలో కనిపిస్తుంది. అయితే, కొన్ని సమయాలలో ఒకే నెలలో రెండు సార్లు పౌర్ణమి వస్తుంది. ఇది ఆకాశంలో ఏర్పడే అద్భుతంగా శాస్త్రవేత్తలు తెలుపుతుంటారు. ఈ విధంగా ఒకే నెలలో రెండో సారి వచ్చే పౌర్ణమిని ఖగోళ భాషలో బ్లూ మూన్ అంటారు. ఆ రెండో పౌర్ణమి శుక్రవారం రాత్రి వస్తుంది. బ్లూమూన్‌ అందరినీ కనువిందు చేయబోతోంది. 
 
జూలై నెలలో రెండో తేది పౌర్ణమి వచ్చింది. ప్రస్తుతం జూలై నెలలోనే 31వ తేది మళ్లీ పౌర్ణమి వస్తుంది. ఈ పౌర్ణమి రోజు చంద్రుడు సంపూర్ణ వెలుగుతో మెరిసిపోతాడు. ఈ విషయం గురించి హైదరాబాద్‌లో ఉన్న బీఎం బిర్లా ప్లానిటోరియం డైరెక్టర్ డాక్టర్ సిద్ధార్థ్ మాట్లాడుతూ.. ఒకే నెలలో రెండు సార్లు పౌర్ణమి రావడం అద్భుతం అన్నారు. నిజానికి ఇరవై తొమ్మిన్నర రోజులకు ఒకసారి పౌర్ణమి వస్తుందని తెలిపారు. నెలకు ఒకటి చొప్పున ఏడాదికి 12 పౌర్ణమిలు వస్తాయన్నారు. మూడేళ్లకొసారి మాత్రమే ఏడాదిలో 13 పౌర్ణమిలు వస్తాయని, అప్పుడు ఒక నెలలో రెండు పౌర్ణమిలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
 
ఈసారి బ్లూ మూన్‌ ఆసియా ఖండంలోని భారత్‌తోపాటు దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, ఐరోపా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఖండాల్లో దర్శనమివ్వనుందని తెలిపారు. న్యూజిలాండ్‌లో మాత్రం సెప్టెంబర్‌ ఒకటో తేది రాత్రి కాసేపు మాత్రమే కనిపిస్తుందని, బ్లూ మూన్‌ రోజున చంద్రుడు మిగతా సమయాలకంటే కాస్త ఎక్కువ నీలం రంగులో కనిపిస్తాడని కొందరు అంటుంటారని, అయితే అది నిజం కాదని తెలిపారు. 
 
మిగతా పౌర్ణమికల కంటే కాస్త స్వచ్ఛతగా ఉన్నందున చంద్రుడు నీలం రంగులో మనకు కనిసిస్తాడని ఆయన వివరించారు. 2012 ఆగస్టు 31న బ్లూ మూన్‌ కనిపించింది. మళ్లీ శుక్రవారం దర్శనమివ్వనుందని, తదుపరి బ్లూ మూన్‌ 2018 జనవరి 31న కనువిందు చేస్తుందని సిద్ధార్థ్ తెలిపారు.