Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

"గాలి" మృతి చిత్తూరు జిల్లాకు తీరని లోటు : వైకాపా ఎమ్మెల్యే రోజా

బుధవారం, 7 ఫిబ్రవరి 2018 (11:35 IST)

Widgets Magazine
rk roja

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు మరణం చిత్తారు జిల్లాకు తీరని లోటని వైకాపా ఎమ్మెల్యే ఆర్.కె.రోజా అభిప్రాయపడ్డారు. మంగళవారం అర్థరాత్రి గాలి ముద్దుకృష్ణమ హఠాన్మరణం చెందిన విషయం తెల్సిందే. ఆయన మృతిపై రోజా తన సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. 
 
ఇందులో... చిత్తూరు జిల్లాలోనే సీనియ‌ర్ నాయ‌కుల్లో ఒక‌రిగా గుర్తింపు తెచ్చుకున్న ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణ‌మ‌ నాయుడు హ‌ఠాత్తుగా మ‌ర‌ణించ‌డం దుర‌దృష్ట‌క‌రమన్నారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని మ‌న‌స్ఫూర్తిగా ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా ప‌నిచేసిన సుదీర్ఘ అనుభ‌వం క‌లిగిన ముద్దు కృష్ణ‌మ‌నాయుడు మ‌ర‌ణించ‌డం చిత్తూరు జిల్లాకు తీర‌ని లోటన్నారు.
 
ఒక సాధార‌ణ ఉపాధ్యాయుడిగా ప‌నిచేసిన గాలిముద్దుకృష్ణ‌మ‌నాయుడు విద్యాశాఖ మంత్రిగా ప‌నిచేయ‌డం ఆయ‌న జీవితంలోని అరుదైన సంద‌ర్భమన్నారు. తెలుగుదేశం పార్టీలో నేను ఆయ‌న క‌లిసి ప‌నిచేసిన సంద‌ర్భాలను ఆమె ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కాగా, ఆరు సార్లు పుత్తూరు, న‌గ‌రి ఎమ్మెల్యేగా ప‌నిచేసిన ఆయ‌న నిరాండ‌బ‌రుడుగా పేరు తెచ్చుకున్నారనీ, అలాంటి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు అకాల‌మ‌ర‌ణానికి చింతిస్తూ ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు నా ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేస్తున్నట్టు రోజా విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

దడపుట్టిస్తున్న టీడీపీ ఎంపీలు.. వైకాపా ఎంపీల్లో కదలిక

కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో రాష్ట్రానికి తీరని అన్యాయం ...

news

సభ నుంచి బయటకు గెంటేసిన వెనక్కి తగ్గొద్దు : ఎంపీలకు చంద్రబాబు

రాష్ట్రానికి అన్యాయం జరిగిన చోటనే రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూడాలని తమ పార్టీ ఎంపీలకు ...

news

బీజేపీ హయాంలో పెరిగిన మతకలహాలు... యూపీలోనే అధికం

కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో బీజేపీ సర్కారు కొలువుదీరిన తర్వాత దేశ ...

news

జమ్మూకాశ్మీర్‌లో ఆమ్రపాలి వివాహం- లాంగ్ లీవ్.. టర్కీలో హనీమూన్‌

వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలికి పెళ్లి కుదిరింది. 2010 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన ...

Widgets Magazine