Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

డెంగీ జ్వరంతో ఎమ్మెల్సీ గాలిముద్దుకృష్ణమనాయుడు హఠాన్మరణం

బుధవారం, 7 ఫిబ్రవరి 2018 (08:35 IST)

Widgets Magazine
gali muddu krishnama naidu

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, శాసనమండలి సభ్యుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 71 యేళ్లు. రెండ్రోజులుగా డెంగీ జ్వరంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆయన మంగళవారం అర్థరాత్రి కన్నుమూశారు. 
 
రెండు నెలల క్రితం గుండె ఆపరేషన్ చేయించుకున్న గాలి ముద్దుకృష్ణమ నాయుడి ఆరోగ్యం బాగానే కుదుటపడింది. అయితే, రెండు రోజుల క్రితం ఆయనకు డెంగీ జ్వరం రావడంతో ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ ఆయనకు వైద్యులు చికిత్స చేసినప్పటికీ.. ప్రాణాలు కాపాడలేక పోయారు. ఫలితంగా టీడీపీ ఓ సీనియర్ నేతను కోల్పోయింది. ప్రస్తుతం తిరుపతిలోని పద్మావతిపురంలో ఉంటున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీలో సీనియర్‌ నాయకునిగా పలు పదవులు చేపట్టారు. 
 
ముద్దుకృష్ణమ నాయుడు 1947 జూన్‌ 9న చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం వెంకట్రామాపురంలో జి.రామానాయుడు, రాజమ్మ దంపతులకు జన్మించారు. విద్యాభ్యాసం తర్వాత ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించిన ఆయన.. 1983లో ఎన్.టి. రామారావు పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చారు. పుత్తూరు నుంచి ఆరుసార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించి రికార్డులకెక్కారు. 2014 ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి వైకాపా అభ్యర్థి ఆర్.కె రోజా చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం తెదేపా ఎమ్మెల్సీగా సేవలందిస్తున్నారు. గాలి మృతిపట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఆ రాస్కెల్‌ను నడిరోడ్డుపై అలా చేయాలి, పెదాలు పగులగొడుతున్నా భరించాలా? నన్నపనేని ప్రశ్న(Video)

ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ వార్తలోకెక్కే మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి ...

news

మూడు నెలల్లో మధుమేహం మాయం... అమరావతిలో వైద్యుడు కాని వైద్యుడి సలహా

అమరావతి : ఆహారంలో మార్పుల ద్వారా మధుమేహం, బీపీ, ఊబకాయం వంటి జీవన శైలి వ్యాధులను నయం ...

news

డొనాల్ట్ ట్రంప్‌ చేయిపట్టుకుంటే.. మెలానియా ట్రంప్ ఇలా? (వీడియో)

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో గతంలో ఇజ్రాయేల్ పర్యటనకు వెళ్లిన సందర్భంగా ట్రంప్ ...

news

ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు ఎలా ఇవ్వాలో అర్థంకావట్లేదు : అరుణ్ జైట్లీ

విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా ...

Widgets Magazine