Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వార్డ్ మెంబర్‌గా గెలవడం కూడా చేతకాదు.. ఎమ్మెల్సీని చేశాం: బుద్ధా వెంకన్న

సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (14:07 IST)

Widgets Magazine
Buddha Venkanna

రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్రం విస్మరించిందని.. అందుకే కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీకి మొండిచెయ్యి చూపిందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దీంతో టీడీపీ బీజేపీకి కటీఫ్ ఇవ్వాలని భావిస్తున్న వేళ.. ఏపీ బీజేపీ-టీడీపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.

ఎప్పుడూ రెండెకరాల రైతును అంటోన్న ఏపీ సీఎం చంద్రబాబుకు లక్షల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయంటూ ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు. 
 
ఏకంగా సీఎం చంద్రబాబు నియోజకవర్గంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. కేంద్ర నిధులు రాష్ట్రంలో స్వార్థ పరులకు ఆదాయ వనరులుగా మారాయని వీర్రాజు ఆరోపించారు. ఈ నేపథ్యంలో సోము వీర్రాజుపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కనీసం వార్డ్ మెంబర్‌గా గెలవడం కూడా చేతకాని సోము వీర్రాజును ఎమ్మెల్సీగా చేసింది టీడీపీనేనని తెలిపారు. 
 
వీర్రాజు వైకాపాకు ఎంతకు అమ్ముడుపోయారని అడిగారు. టీడీపీ అవినీతి పార్టీ అని విమర్శిస్తున్న వీర్రాజు... అవినీతి పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిని ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. వైసీపీ అధినేత జగన్‌ను వీర్రాజు ఎందుకు విమర్శించడం లేదని నిలదీశారు. ఆయనది బీజేపీ అజెండానా? లేక వైసీపీ అజెండానా? అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబును విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని మండిపడ్డారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కాశ్మీర్ బాలికపై మత్తుమందిచ్చి అత్యాచారం.. వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్.. ఆపై?

కాశ్మీర్‌లో ఓ బాలిక నరకం అనుభవించింది. తనకు ఎదురైన ఘటనను చెప్పుకుని.. తనకు ఏర్పడిన ...

news

ఎన్నారై సంబంధాలొద్దండి బాబూ.. వేధిస్తున్నారట.. 8 గంటలకు ఓ ఫోన్‌కాల్?

ఎన్నారై సంబంధాల కోసం వెతుకుతున్నారా? విదేశాల్లో పనిచేసే వ్యక్తులకు అమ్మానిచ్చి పెళ్లి ...

news

భర్త వేధింపులు అంతా ఇంతా కాదు.. కాపాడండి.. ట్విట్టర్ వీడియోలో మహిళ

భర్తతో చిత్రహింసలు భరించలేకపోతున్నానని ఓ మహిళ ట్విట్టర్ వీడియో ద్వారా పోలీసులను ...

news

ప్రామిస్ టూత్‌పేస్ట్ ఆ నవ్వుల్ని తీసుకొస్తాయా?: ప్రకాష్ రాజ్ ప్రశ్న

2014లో అమ్మిన ప్రామిస్ టూత్‌పేస్ట్ రైతులు, నిరుద్యోగ యువత ముఖాలపై నవ్వులు పూయించడంలో ...

Widgets Magazine