శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: గురువారం, 18 ఆగస్టు 2016 (18:04 IST)

విభ‌జ‌న త‌ర్వాత మరికాస్త... ఏపీకి రూ.1,976 కోట్ల ఆర్థిక సాయం.. పెదవి విరిచిన బోండా

ఢిల్లీ : విభజన తర్వాత ఆర్థికంగా కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం ప్రకటించింది. రాష్ట్రానికి రూ.1976 కోట్లు విడుదల చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక లోటు భర్తీ కింద రూ.1,176 కోట్లు, రాజధాని నిర్మాణానికి రూ

ఢిల్లీ : విభజన తర్వాత ఆర్థికంగా కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం ప్రకటించింది. రాష్ట్రానికి రూ.1976 కోట్లు విడుదల చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక లోటు భర్తీ కింద రూ.1,176 కోట్లు, రాజధాని నిర్మాణానికి రూ.450 కోట్లు, వెనకబడిన జిల్లాల అభివృద్ధికి రూ.350 కోట్లు విడుదల చేసింది. 
 
అయితే, ఇదేమీ అంత పెద్ద మొత్తం కాద‌న్న వాద‌న ఏపీ నేత‌ల్లో వ్య‌క్తం అవుతోంది. రాజ‌ధాని నిర్మాణానికి 450 కోట్ల రూపాయ‌లు ఏమూల‌కు వ‌స్తాయ‌ని అంటున్నారు. కానీ, ఇప్ప‌టికే ఇచ్చిన మొత్తానికి రావాల్సిన లెక్క‌లు కేంద్రానికి పంపితేనే, మిగ‌తా స‌హాయం అందుతుంద‌ని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంటోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమ మాట్లాడుతూ... కేంద్రం ఏపీకి ఇచ్చిన హామీలను పక్కనపెట్టేస్తున్నందుకు ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతుందన్నరు. ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రం హక్కు అనీ, దాన్ని సాధించేవరకూ పోరాడుతామని ఆయన అన్నారు.