సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: గురువారం, 27 సెప్టెంబరు 2018 (15:00 IST)

కేరళ వరద బాధితులకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ ఉద్యోగులు రూ.2.91 కోట్ల విరాళం

అమరావతి : వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన కేరళ వాసులకు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ ఉద్యోగులు రూ.2,91,43,466 విరాళం అందజేయనున్నట్లు శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. అసెంబ్లీలోని ఒకటో అంతస్తు కమిటీ హాలులో గురువార

అమరావతి : వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన కేరళ వాసులకు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ ఉద్యోగులు రూ.2,91,43,466 విరాళం అందజేయనున్నట్లు శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. అసెంబ్లీలోని ఒకటో అంతస్తు కమిటీ హాలులో గురువారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ విషయం తెలిపారు. 
 
వరదలతో కేరళ అతలాకుతలమైందన్నారు. ప్రాణ, ఆస్తినష్టం కలిగిందన్నారు. ఈ విషాదకర సమయంలో కేరళ వాసులకు అండగా ఉండాలని భావించిన ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక సాయం అందించిందన్నారు. ఇపుడు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు అసెంబ్లీ ఉద్యోగులు కూడా ఒక నెల వేతనంతో పాటు ఇతర అలెవెన్సులు విరాళం ఇవ్వాలని నిర్ణయించారన్నారు. 
 
శాసన సభ్యులు రూ.2,70,28,466, శాసన మండలి సభ్యులు రూ. 19,90,000, అసెంబ్లీ ఉద్యోగులు రూ.1,25,000 కలిపి మొత్తం రూ. 2,91,43,466 విరాళంగా అందజేయనున్నారని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు.