శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 19 మే 2019 (12:01 IST)

కిడ్నీ స్కామ్‌ : శ్రద్ధ ఆస్పత్రి సీజ్

కిడ్నీ మార్పిడి స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రద్ధ ఆస్పత్రిని సీజ్ చేశారు. ఈ ఆస్పత్రి యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్టు త్రిసభ్య కమిటీ నివేదిక ఇచ్చింది. ఈ కమిటీ నివేదికను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె.భాస్కర్‌ సీజ్ చేయాలని ఆదేశాలు జారీచేశారు. 
 
శ్రద్ధ ఆస్పత్రిలో 2012 నుంచి ఇప్పటివరకు 29 అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలను నిబంధనలకు విరుద్ధంగా చేసినట్టు త్రిసభ్య కమిటీ నిర్ధారించింది. ఈ నేపథ్యంలో ఆసుపత్రిని సీజ్‌ చేయాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీచేశారు. నివేదిక ప్రతిని పోలీస్‌ కమిషనర్‌కు పంపిన కలెక్టర్‌ క్రిమినల్‌ కేసులో తదుపరి చర్యలు తీసుకోవాలని కోరారు. 
 
అదేవిధంగా త్రిసభ్య కమిటీ నగరంలోని ఇతర ఆసుపత్రుల్లోను ఐదేళ్లలో జరిగిన అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలను పరిశీలించి ఎన్ని కేసులకు అనుమతులున్నాయో పరిశీలించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ ఆదేశించారు.