Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఓరీ జాత్యహంకారీ ట్రంప్.. అనాథలా కుక్క చావు చస్తావు...: సిద్ధాంతి ములుగు శాపం

సోమవారం, 6 మార్చి 2017 (14:37 IST)

Widgets Magazine
mulugu

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను పంచాంగకర్త, ప్రముఖ సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శపించారు. ట్రంప్ అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రపంచ దేశాలకు కష్టాలు ఎదురయ్యాయి. ముఖ్యంగా భారతీయులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ప్రవాస భారతీయులపై జరుగుతున్న జాత్యాహంకార దాడులు ఎక్కువై పోయాయి. గత వారం రోజుల్లోనే ముగ్గురు భారతీయులపై దాడి జరిగింది. ఇది భారతీయులను తీవ్రంగా కలిచివేసింది. 
 
ఈ పరిణామాలన్నీ ములుగు రామలింగేశ్వర ప్రసాద్ ఆగ్రహం తెప్చించాయి. దీంతో ఆయన డోనాల్డ్ ట్రంప్‌ను శపించారు. ట్రంప్‌ను ఉద్దేశించి కఠిన వ్యాఖ్యలు చేశారు. ఆయన కుక్క చావు చస్తాడంటూ శాపనార్థాలు పెట్టారు. ట్రంప్ జాతక చక్రం ప్రకారం, ఏలినాటి శని నడుస్తోందని, దీని ప్రభావంతో ఆయన పూర్తి కాలం పాటు అమెరికా అధ్యక్షుడిగా కొనసాగలేరని జోస్యం చెప్పారు. 
 
"ఓరీ జాత్యహంకారీ డోనాల్డ్ ట్రంప్... నీవల్ల నిష్కారణంగా భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ పాపం నీకు తప్పకుండా తగులుతుంది. నీవు చేసినటువంటి పాపాలకు ఫలితం చెబుతున్నా విను. ఇదే నేను నీకు ఇచ్చే శాపం. నీ అంత్య కాలంలో, నీ మరణ సమయంలో, నీ సన్నిహితులుగానీ, నీ మిత్రులుగానీ, నీ భార్యగానీ, నీ బంధువులుగానీ ఎవ్వరూ లేకుండా, అనాథలాగా కుక్క చావు చస్తావు. నా మాటకు తిరుగులేదు" అంటూ శపించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

బాబ్రీ మసీదు విధ్వంసం : అద్వానీ - ఉమాభారతిల మెడకు ఉచ్చు...

బాబీ మసీదు విధ్వంసం కేసులో భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీతో పాటు కేంద్ర మంత్రి ...

news

నా భర్తను పెళ్లాడరూ...? ఓ భార్య అభ్యర్థన, ఎందుకు?

సినిమాల్లోనే ఇలాంటి మాటలు వింటుంటాం. నిజ జీవితంలో ఎవ్వరూ తన భర్తను మరొకరికి కట్టబెట్టాలని ...

news

జయ రక్తంతో కూడిన గాయాలతో ఆస్పత్రిలో చేరారు-ఇడ్లీ తిన్నారని తంబిదురై చెప్పమన్నారు

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత రక్తంతో కూడిన గాయాలతో అపోలో ఆస్పత్రిలో చేరారని ...

news

బల్గేరియా జాతీయోత్సవాల్లో బల్గేరియా కాన్సుల్ డాక్టర్ కిరణ్ విందు

హైదరాబాద్: బల్గేరియా జాతీయ దినోత్సవం సందర్భంగా 2017, మార్చి నాలుగో తేదీన శనివారం ...

Widgets Magazine