శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 25 మే 2015 (20:37 IST)

అమరావతి కల సాకారానికి దశాబ్దాలు పడుతుంది : సింగపూర్ మంత్రి

అమరావతి రాజధాని నిర్మాణ కల సాకారానికి కొన్ని దశాబ్దాలు పడుతుందని సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అన్నారు. ఇప్పటి వరకు తమ తొలి ప్రాధాన్యత మాస్టర్ ప్లాన్ రూపకల్పనేనని చెప్పాు. రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానిస్తే నిబంధనలకు అనుగుణంగా రాజధాని నిర్మాణంలోనూ సింగపూర్‌ కంపెనీలు పాల్గొంటాయని చెప్పారు. సోమవారం నవ్యాంధ్ర రాజధాని అమరావతి లోగోను సీఎం చంద్రబాబు సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సింగపూర్ మంత్రి పై విధంగా మాట్లాడారు. 
 
అలాగే, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. రాజధాని అంటే పరిపాలన కేంద్రం మాత్రమే కాదని, ఆర్థిక వనరులు, ఉపాధి కల్పన కేంద్రం రాజధాని అని అన్నారు. వచ్చే నెల 6న రాజధాని నిర్మాణానికి భూమిపూజ చేస్తామని ప్రకటించారు. పారదర్శకత, నిజాయితీలో సింగపూర్‌కు తిరుగులేదని సీఎం తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఏపీకి సింగపూర్‌ సాయం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు అభినందనలు తెలిపారు. రైతులు, కూలీలను అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు.