శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr

శ్మశానంలో పాప కదిలింది... ప్రాణం నిలుపుకుంది... కార్పోరేట్ ఘనకార్యం

పాప చనిపోయిందని విజయవాడలోని కార్పోరేట్ పెద్దాస్పత్రి డెత్ సర్టిఫికెట్ ఇచ్చేసింది. ఇక లాభంలేదని బంధువులు ఆ పాపను శ్మశానానికి తీసుకెళ్ళారు. ఇక ఐదు నిమిషాలలో ఆ పాపను ఖననం చేసేస్తారు. తొమ్మిదేళ్ల పసిబిడ్డ తన ప్రాణాన్ని తానే కాపాడుకుంది. కదలికలతో తాను బతికే ఉన్నానని చెప్పింది. ఇక ఉరుకులు పరుగుల మీది ఆ పాపను తీసుకెళ్ళి ఆసుపత్రిలో చేర్చారు. వివరాలిలా ఉన్నాయి. 
 
పశ్చిమ గోదావరి జిల్లా పెద్ద చింతలపూడికి చెందిన లక్ష్మీ తిరుపతమ్మ, చెన్నకేశవరాజు దంపతులకు తొమ్మిది రోజుల క్రితం చింతలపూడిలోని సిరి హాస్పిటల్‌లో చిన్నారి జన్మించింది. పాప ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని, విజయవాడ పెద్దాసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో పాపను విజయవాడ కరెన్సీ నగర్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో నాలుగురోజుల క్రితం చేర్చారు. 
 
పాపను వెంటిలేటర్‌పై ఉంచాలని దాదాపు రూ. లక్షా 20 వేలు కట్టమన్నారు. చిన్న చిన్న పనులు చేసుకుని జీవించే పాప తండ్రి, తాత అప్పులు చేసి డబ్బు కట్టారు. అయితే.. బుధవారం ఉదయం వైద్యులు పాప మరణించిందని, డెత్‌ సర్టిఫికెట్‌ సహా అప్పగించడంతో పాపను ఖననం చేయడానికి తండ్రి, తాతలు గుణదల శ్మశానవాటికకు తీసుకెళ్లారు. ఈ సమయంలో తాత ఒడిలో ఉన్న పాప ఒక్కసారిగా కదిలింది. దీంతో చిన్నారిని 108లో బెజవాడకు తరలించి చికిత్స చేస్తున్నారు.