Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తల్లి చేయి విదిలించడంతో.. పాపను కాటేసిన పాము.. గౌనులోకెళ్ళిన పామును తీసేలోపే..?

మంగళవారం, 13 జూన్ 2017 (16:00 IST)

Widgets Magazine

అమ్మపక్కన హాయిగా నిద్రించిన అభంశుభం తెలియని నాలుగేళ్ల పాప పాముకాటుతో నిద్రలోనే కన్నుమూసింది. ఈ ఘటన విజయనగరం జిల్లా సాలూరు మండలం, కురుకూటిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వంతల సీతయ్య, నీలమ్మ గిరిజన దంపతులకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు మగబిడ్డలు, నాలుగేళ్ల సునీత ఉన్నారు. రాత్రి భోజనాల తర్వాత సునీత తల్లి నీలమ్మ వద్ద పడుకుంది. 
 
నేలపైనే అందరూ నిద్రిస్తున్నారు. తెల్లవారుజామున రెండు గంటల సమయంలో తల్లి నీలమ్మపై పాము పాకింది. నిద్రలో ఆమె చేయి విదల్చడంతో ఆ పాము పక్కనే ఉన్న చిన్నారి సునీతపై పడింది. పాము పాప గౌనులోకి వెళ్లింది. చిన్నారి చేయిపెట్టి తీయడానికి ప్రయత్నించడంతో పాము కాటు వేసింది. పాప ఏడుపు విని సునీత తల్లిదండ్రులు లైట్ వేసి చూశారు.
 
వారు కేకలు వేయడంతో పామును స్థానికులు పట్టుకున్నారు. చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగానే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. తనపై పాకిన పాము తనను బలితీసుకుని వుంటే బాగుండునని తల్లి విలపించడం చూపరులను కలచివేసింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

జగన్‌కు హైకోర్టులో చుక్కెదురు.. క్వాష్ పిటిషన్ కొట్టివేత.. ప్రాథమిక ఆధారాలున్నాయ్..

వైసీపీ అధినేత జగన్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. కృష్ణా జిల్లా నందిగామలో అధికారులపట్ల ...

news

డ్రగ్స్ దొంగల్ని లంచం తీసుకుని విడిపించిన స్పెషలిస్ట్ ఇంద్రజిత్ అరెస్ట్.. ముఖానికి ముసుగుకట్టి?

డ్రగ్స్ దొంగల్ని పట్టుకుంటే.. వాళ్లు ఏదో రూపంలో విడుదలైపోతున్నారు. ఇలా ఎందరో నిందితులు ...

news

గాజువాక రోడ్డుపై... మగ సీఐ వర్సెస్ స్త్రీ ఎస్ఐ... అసలేం జరిగింది?

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించకూడదంటూ చెప్పే పోలీసులే ఉల్లంఘిస్తే ఏమవుతుంది..? ఇలాగే ...

news

ఐటీ ఉద్యోగాల కోసం రూ.లక్ష.. 70మంది మోసపోయారు.. అవెన్యూ బండారం బయటపడింది..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దెబ్బతో ఐటీ ఉద్యోగాలంటేనే వద్దు బాబోయ్ అంటూ ...

Widgets Magazine