శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 21 నవంబరు 2014 (10:30 IST)

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరుతో మోసం... రూ.30కోట్లు టోకరా

సాప్ట్వేర్ ఉద్యోగాల పేరుతో మరో మోసగాడు నిరుద్యోగులకు టోకరా వేశాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అతగాడు బెంగళూరులో సుమారు రూ.30 కోట్లకు...కుచ్చుటోపీ పెట్టాడు.  
 
పోలీసుల కథనాల మేరకు.. పోలీసులు జరిపిన ప్రారధమిక విచారణలో అనంతపురం జిల్లా హిందుపురంకు చెందిన అంజాద్ పర్వేద్ బెంగుళూర్‌లో ఉన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలతో తమకు లింక్‌లు ఉన్నాయని, చేతినిండా జీతాలు, క్యాబులు అంటూ నిరుద్యోగులకు ఆశ చూపాడు. ఉద్యోగుల కావాలంటే ఎంతో కొంత డబ్బు ఇవ్వాలని తెలిపాడు.
 
దీంతో ఉద్యోగ వేటలో ఉన్న పలువురు నిరుద్యోగులు సాఫ్ట్‌వేర్ సంస్థల్లో ఉద్యోగుల కోసం పెద్ద మొత్తంలో డబ్బును అంజాద్ పర్వేకు ముట్టచెప్పుకున్నారు. అందినకాడికి డబ్బు వసూలు చేసిన అనంతరం అక్కడ నుంచి దుకాణం ఎత్తేశాడు. దాంతో బాధితులు హిందుపురం పోలీసుల్ని ఆశ్రయించారు. 
 
అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేసి,... తమ డబ్బును ఇప్పించాల్సిందిగా బాధితులు కోరుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.