శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : గురువారం, 30 అక్టోబరు 2014 (11:09 IST)

శ్రీలంకలో కూలిన కొండ చరియలు.. 300 మంది గల్లంతు.. 20 మృతదేహాలు లభ్యం

శ్రీలంకలో భారత వంశావలికి చెందిన తమిళ ప్రజలు అధికంగా నివాసముండే పర్వత ప్రాంతంలో కొండ చరియలు కూలిపడడంతో 300 మంది మట్టిలో కూరుకుపోయారు. ఇప్పటి వరకు వారిలో 20 మంది మృత దేహాలను వెలికి తీసినట్టు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలుపుతున్నారు. 
 
గత కొన్ని రోజులుగా శ్రీలంకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు పర్వత ప్రాంతాలలో కొండ చరియలు కూలిపోతున్నాయి. ఈ స్థితిలో శ్రీలంక రాజధాని కొలంబోకు 220 కిలో మీటర్ల దూరంలో ఉన్న సెంట్రల్ బాదుల్లా జిల్లాలో భారత సంతతికి చెందిన వారు అధికంగా నివాసముంటున్నారు. 
 
ఈ ప్రాంతంలో బుధవారం కొండ చెరియలు కూలిపడ్డాయి. దీంతో మొత్తం 70 ఇల్లు మట్టిలో కూరుకుపోయాయి. ఈ ఇళ్లలో నివాసముంటున్న 300 మందికి పైగా గల్లంతైయ్యారు. వారిని రక్షించే చర్యలు వేగంగా జరుగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు 20 మృత దేహాలను మాత్రం అధికారులు బయటకు తియ్యగలిగారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 
 
రక్షణ చర్యల్లో 500 మందికి పైగా శ్రీలంక సైనికులు పాల్గొని ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ ప్రాంతంలో కొండ చెరియలు కూలే ప్రమాదం ఉందని ముందుగానే హెచ్చరించినట్లుగాను, కొందరు వెళ్లిపోగా, మిగిలిన వారు మట్టిలో కూరుకుపోయారని అధికారులు తెలిపారు.