Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

హైదరాబాదులో యువతి దారుణ హత్య: ప్రేమోన్మాదే చంపేశాడా?

బుధవారం, 10 జనవరి 2018 (11:23 IST)

Widgets Magazine

హైదరాబాదులో ప్రేమ పేరుతో ఓ ఉన్మాది ఓ యువతిని పొట్టనబెట్టుకున్నాడు. ప్రేమ పేరుతో వేధించిన అతడు కత్తులతో పొడిచి.. దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే.. మంగళవారం అర్థరాత్రి యువతి దారుణంగా హత్యకు గురైందని పోలీసులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన జానకి అనే యువతి మూసాపేట్ హబీబ్ నగర్‌లో ఉంటోంది. 
 
కూకట్ పల్లిలోని డీమార్ట్‌లో పనిచేస్తున్న ఆమెను ఆనంద్ అనే యువకుడు ప్రేమిస్తున్నానని వేధించేవాడు. ప్రేమించకపోతే చంపేస్తానంటూ చాలాసార్లు  బెదిరించాడని జానకి స్నేహితురాళ్లు తెలిపారు. అయితే జానకి హత్యకు గురైంది. ఈ హత్యకు ఆనందే కారణమని వారు అనుమానిస్తున్నారు. 
 
జానకి ఒంటరిగా వున్న సమయంలో ఆమెపై ఈ దారుణం జరిగిందని.. ఉద్యోగానికి వెళ్లొచ్చి చూసేలోపు రక్తపుమడుగులో జానకి కనిపించిందని స్నేహితురాళ్లు చెప్పారు. ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయిందని వారు వాపోతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అమెరికా రహస్య నిఘా ఉపగ్రహ ప్రయోగం విఫలం..

అమెరికా రహస్య నిఘా ఉపగ్రహ ప్రయోగం విఫలమైంది. ఈ ఉపగ్రహాన్ని నార్త్‌రప్ గ్రుమన్ అనే సంస్థ ...

news

జామకాయ ఓ బాలుడి ప్రాణాలు తీసింది.. ఎలాగంటే?

ఓ జామకాయ ఓ బాలుడి ప్రాణాలను బలిగొంది. తొడపై జామకాయ పెట్టి కోయాలనుకున్న విద్యార్థి మృతి ...

news

పడకగదిలో బాయ్‌ఫ్రెండ్‌తో కూతురు.. తండ్రి గుండె ఆగిపోయింది.. అయినా పశ్చాత్తాపం లేదు

ప్రేమపై మోజుతో కన్నతండ్రి చనిపోయినా ఓ యువతి పట్టించుకోలేదు. కంటికి రెప్పలా కాపాడుకున్న ...

news

రాష్ట్రంలోనే కడపలో ఆ గ్రామంలోని ప్రజలు బాగా డబ్బున్నవారు...

‘జనంలో చైతన్యం, సమాజాభివృద్ధికి సమాయత్తం చేయడమే జన్మభూమి-మా వూరు లక్ష్యంగా’ ముఖ్యమంత్రి ...

Widgets Magazine