Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సిబిఐటీలో అవినీతి.. విద్యార్థులపై ఫీజు బండ

బుధవారం, 6 డిశెంబరు 2017 (22:10 IST)

Widgets Magazine
students dharna

హైదరాబాద్‌ గండిపేటలోని సిబిఐటి కళాశాలలో బుధవారం నాడు విద్యార్థినీవిద్యార్థులు ధర్నా చేశారు. ప్రిన్సిపాల్‌ డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. పలు టీవీ మాధ్యామలు రావడంతో విద్యార్థులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. గత నెల క్రితం ఫీజు పెంచుతున్నట్లు దానికి మీరు సమ్మతి తెలపాల్సిందిగా ఓ ఫారాన్ని వారికి అందజేశారు. అందులో యాజమాన్యం పెంచే ఫీజుకు తల్లిదండ్రుల సంతకం చేసి ఇవ్వాలని వుంది. అందుకు చాలామంది పేరెంట్స్‌ నిరాకరించారు. 
 
ఇది గ్రహించిన యాజమాన్యం.. మీరు అప్లికేషన్‌ మీద సంతకం పెట్టినా పెట్టకపోయినా.. మేం ఫీజు పెంచే తీరుతాం అంటూ విద్యార్థులతో కరాఖండిగా చెప్పేసింది. అదేమిటని ప్రశ్నిస్తే.. ల్యాబ్‌ ఎగ్జామ్‌లు మా చేతుల్లో వున్నాయని ప్రస్తుతం ప్రిన్సిపాల్‌ రవీందర్‌ రెడ్డి బెదిరించినట్లుగా విద్యార్థులు ఆరోపించారు. ఇదిలావుండగా,  ప్రస్తుతం ఇంజనీరింగ్‌ విద్యార్థుల ఫీజు రెండు లక్షలు వుండగా.. దాన్ని ఏకంగా మూడు లక్షలకు పెంచేశారు. దానిపై టీవీ మాధ్యమాలకు విద్యార్థినీవిద్యార్థులు వెల్లడించారు. అయితే దీనిపై ప్రిన్సిపాల్‌ను కలవడానికి ప్రయత్నించినా టీవీ వారికి సాధ్యపడలేదు. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి అక్కడనుంచి వెళ్ళిపోవాల్సిందిగా కోరారు.
 
అసలేం జరుగుతుంది.
కాలేజీ యాజమాన్యం ఫీజు పెంపు అనేది కోర్టులో వుంది. వాసవి సంస్థ కోర్టు ద్వారా ఫీజును పెంచేట్లుగా అనుమతి పొందింది. దాన్ని సాకుగా తీసుకుని సిబిఐటి.. కోర్టును ఆశ్రయించింది. అయితే సిబిఐటీలో గతంలో వున్న ప్రిన్సిపాల్‌ 5 కోట్ల వరకు గోల్‌మాల్‌ చేయడంతో ఆయన్ను విధుల నుంచి తొలగించారు. దానిపై కేసు పెట్టడానికి కూడా యాజమాన్యం ధైర్యం చేయలేకపోయిందన్న విమర్శ వుంది. ఆ కుంభకోణంలో యాజమాన్యానికి సంబంధించి స్టాఫ్‌ వున్నారనే ఆరోపణలున్నాయి. యాజమాన్యానికి చెందిన కుటుంబీకులే అందులో ఇన్‌వాల్‌ అయివున్నారనీ, దాంతో చేసేది లేక... ఆ లోటును విద్యార్థుల ఫీజు ద్వారా భర్తీ చేసుకోవాలని చూస్తోందని ఓ విద్యార్థిని ఓ.యు. విద్యార్థి సంఘ నాయకులకు తెలియజేసింది. దీంతో ఆ నాయకులు మంత్రి కెటిఆర్‌ దృష్టికి తీసుకెల్ళేందుకు ప్రయత్నిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

బోయలకు దేవుడు చంద్రబాబు... వాల్మీకి, బోయ ఫెడరేషన్ చైర్మన్

అమరావతి: రాష్ట్రంలో వాల్మీకి, బోయల స్థితిగతులను అర్థం చేసుకొని, వారిని ఎస్టీల జాబితాలో ...

news

జనవరి 16 నుంచి బాపట్ల సూర్యలంకలో మిలటరీ శిక్షణ... 100 కి.మీ వరకూ వార్నింగ్

అమరావతి: భారత మిలటరీ శిక్షణా కార్యక్రమాల్లో భాగంగా గుంటూరు జిల్లా బాపట్ల మండలంలోని ...

news

చెప్తా... చెప్తా... కరెక్ట్ సమయం చూసి పరకాల ప్రభాకర్‌కు...: పవన్ కళ్యాణ్

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రభుత్వాలను ప్రశ్నించడం ఊపందుకున్నది. ఉత్తరాంధ్ర ...

news

12,370 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రెడీ... శాడిస్ట్ ఉపాధ్యాయుడ్ని తొలగించాం...

అమరావతి : రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. 12,370 ...

Widgets Magazine