శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 30 జులై 2014 (12:15 IST)

చుండూరు కేసులో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే!

గుంటూరు జిల్లా చుండూరు కేసులో హైకోర్టు విచారణపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. చుండూరు దళితుల ఊచకోత కేసును న్యాయమూర్తులు జస్టిస్ మదన్ బిలోకూర్, జస్టిస్ సి.నాగప్పన్‌తో కూడిన ధర్మాసనం ముందు ఈ కేసు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా చుండూరు కేసులో హైకోర్టులో ఉన్నటువంటి ప్రొసీడింగ్స్‌పై స్టే ఇస్తూ సుప్రీం తీర్పును వెలువడించింది. 
 
ఈ కేసులో హైకోర్టు నిర్దోషులుగా తీర్పునిచ్చిన 52 మందికి కోర్టు నోటీసులు జారీ చేసింది. కాగా ఈ కేసు తదుపరి విచారణపై సుప్రీం కోర్టు నుంచి స్పష్టత రావాల్సి ఉంది. చుండూరు కేసులో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చుండూరు బాధితులు సుప్రీం కోర్టులో పిటిషన్‌పై సుప్రీంలో విచారణ జరిగింది.