ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 18 అక్టోబరు 2018 (11:06 IST)

మేనల్లుడేకదాని చేరదీస్తే కామంతో కాటేశాడు...

బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన అనాథగా ఉన్న మేనల్లుడుని చేరదీస్తే పెరిగి పెద్దవాడైన తర్వాత చివరకు మేనమామ కుమార్తెపై లైంగికదాడికి పాల్పడ్డారు. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో ఈ ఘటన జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి గ్రామానికి చెందిన యువకుడికి (22) చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవటంతో అనాథగా మిగిలిపోయాడు. దీంతో మేనమామ రామాపురం తీసుకెళ్లి పెంచి పెద్ద చేసి పెళ్లిచేశాడు. తాను చేసే పనిలోనే పెట్టుకుని పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఇరువురూ పక్కపక్క ఇళ్లలోనే అద్దెకు నివశిస్తున్నాడు. 
 
ఈ నేపథ్యంలో మేనమామకు ఎనిమిదేళ్ళ వయుసున్న కుమార్తె ఉంది. ఈ క్రమంలో మేనల్లుడు ఆ బాలికకు మొబైల్‌ ఫోన్‌లో చిన్నారికి పోర్న్‌ వీడియోలు చూపిస్తూ, రెండు నెలలుగా అత్యాచారం చేస్తున్నాడు. బాలిక ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.