బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: గురువారం, 9 నవంబరు 2017 (19:53 IST)

విద్యార్థుల ఆత్మహత్యలను నియంత్రిస్తాం... మంత్రి గంటా

విద్యార్థుల ఆత్మహత్యల నియంత్రణకు గట్టిచర్యలు తీసుకుంటున్నామని మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. దీనిపై దృష్టి పెట్టామని, టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తున్నామని, ఒక కమిటీని కూడా నియమించామని ఆ కమిటీ 730 కాలేజీలు తనిఖీ చేశారని చెప్పారు.

విద్యార్థుల ఆత్మహత్యల నియంత్రణకు గట్టిచర్యలు తీసుకుంటున్నామని మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. దీనిపై దృష్టి పెట్టామని, టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తున్నామని, ఒక కమిటీని కూడా నియమించామని ఆ కమిటీ 730 కాలేజీలు తనిఖీ చేశారని చెప్పారు. కాలేజీ సమయాలు, క్రీడల సమయం, సైకాలజిస్ట్‌ల నియామకం వంటి అంశాల్లో చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 
 
ఇంటర్ బోర్డు నిబంధనలు పాటించనివారిపై చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో అనుమతి లేకుండా 158 హాస్టళ్లు ఏర్పటు చేశారని, అయితే విద్యార్థుల విద్యా సంవత్సరానికి ఇబ్బంది లేకుండా ఈ ఏడాది వరకు వాటిని అనుమతిస్తున్నట్లు తెలిపారు. మణిపూర్‌లో తెలుగు విద్యార్థులుపై జరిగిన దాడుల అంశం కేంద్రం దృష్టికి తీసుకువెళ్లామని, వారు తగిన చర్యలు తీసుకుంటారని చెప్పారు. రాష్ట్రంలో బీఈడి కాలేజీల విషయం సమీక్షిస్తామన్నారు. 
 
విశ్వవిద్యాలయాలకు రూ.381 కోట్లు
రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధిపై దృష్టి పెట్టిందని, 7 విశ్వవిద్యాలయాలకు రూ.381 కోట్లు కేటాయించామని, 15, 20 ఏళ్లుగా ఉన్న ఖాళీల భర్తీకి అనుమతించామని, ఏపీపీఎస్సీకి అప్పగించామని, త్వరలో పూర్తి చేస్తారని మంత్రి చెప్పారు. సెంట్రల్ యూనివర్సిటీ నిర్మాణంలో ఉందని తెలిపారు. మన రాష్ట్రం నుంచి విద్యార్థులు బయటకు వెళ్లకుండా ఇక్కడే అంతర్జాతీయ స్థాయి విద్య అందించాన్న ఉద్దేశంతో ఆ స్థాయి విశ్వవిద్యాలయాను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. వారికి మనం తక్కువ ధరకు భూములు మాత్రమే ఇస్తున్నామన్నారు.
 
గత నెలలో జరిపిన అమెరికా  పర్యటనలో తెలుగు విద్యార్థులకు ప్రయోజనకరమైన పలు ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిపారు. అక్కడి ఒహాయో  విశ్వవిద్యాలయంతో చేసుకున్న ఒప్పందం వల్ల తెలుగు విద్యార్థులకు ఏడాదికి రూ.400 కోట్ల వరకు ఆదా అవుతుందని వివరించారు. రాష్ట్రంలో వెయ్యి డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు. రైట్‌ స్టేట్‌ విశ్వవిద్యాలయంతో కూడా ఒప్పందం ఖరారైనట్లు  ఆయన తెలిపారు. ఆ యూనివర్సిటీ వారు వచ్చే నెలలో మన రాష్ట్రంలో పర్యటిస్తారని, భోగాపురంలో గాని, అమరావతిలో గాని వారు కేంపస్ ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు.