శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 12 జనవరి 2017 (12:00 IST)

జబర్ధస్త్ అయిపోతే.. రోజాకు రికార్డు డ్యాన్సులే మిగులుతాయ్.. ఆనం కామెంట్స్‌పై నోటీసులు

టీడీపీ నేతలు జేసీ దివాకర్ రెడ్డి, ఆనం వివేకానంద రెడ్డి వైకాపాపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైకాపా ఎమ్మెల్యే రోజాపట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత ఆనం వివేకానంద

టీడీపీ నేతలు జేసీ దివాకర్ రెడ్డి, ఆనం వివేకానంద రెడ్డి వైకాపాపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైకాపా ఎమ్మెల్యే రోజాపట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత ఆనం వివేకానంద రెడ్డికి సమన్లు జారీ అయ్యాయి. మార్చి 8 న కోర్టు ముందు హాజరు కావాలని నాంపల్లిలోని మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆదేశించారు. వివేకా వ్యాఖ్యలపై రోజా పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. 
 
రోజా తరఫున వైకాపా లీగల్ సెల్ అధ్యక్షుడు సుధాకర రెడ్డి తన వాదనలను వినిపించారు. గత ఏడాది ఫిబ్రవరి 29న వివేకా మీడియాతో మాట్లాడుతూ రోజాను కించపరిచేలా కామెంట్స్ చేశారనే విషయాన్ని సుధాకర రెడ్డి కోర్టు దృష్టికి తెచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సీడీని కూడా కోర్టుకు అందజేయడంతో ఆనం వివేకాపై కోర్టు సీరియస్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 
 
కాగా తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి వైకాపా ఎమ్మెల్యే రోజా పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసిపి అధినేత జగన్ కార్యక్రమాల్లో రోజాకు రికార్డింగ్ డ్యాన్సులే గతి అని తీవ్రంగా మండిపడ్డారు. రోజాకు జబర్దస్త్ ప్రోగ్రామ్ అయిపోతే జగన్ ప్రోగ్రాముల్లో రికార్డింగ్ డ్యాన్సులే మిగులుతాయని ఎద్దేవా చేశారు. జగన్‌ను 130 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ, 33 ఏళ్ల తెలుగుదేశం పార్టీలు ఏం చేయలేకపోయాయని చెప్పారు. కానీ రోజా ఎక్కడ పాదం మోపితే అక్కడ ఆ పార్టీ సర్వనాశనం ఖాయమని జోస్యం చెప్పారు.
 
రోజా టీడీపీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. అంతకుముందు రోజా టీడీపీలో ఉందని, అప్పుడు టీడీపీ అధికారంలోకి రాలేదన్నారు.