శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: సోమవారం, 30 మే 2016 (18:38 IST)

టీజి వెంకటేష్‌కు రాజ్యసభ టిక్కెట్... అందుకేలే..., సురేష్ ప్రభుకి కన్ఫర్మ్

విజ‌య‌వాడ‌: సుదీర్ఘ‌కాలం కాంగ్రెస్ పార్టీలో ఉండి, క‌ర్నూలులో బిగ్ షాట్‌గా పేరొందిన రాజ‌కీయ ప్ర‌ముఖుడు టి.జి.వెంక‌టేశ్‌కు అనూహ్యంగా టీడీపీ రాజ్య‌స‌భ టిక్కెట్ ద‌క్కింది. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులెవరన్న సస్పెన్సుకు తెరపడింది. సిట్టింగ్ సభ్యుడు స

విజ‌య‌వాడ‌:  సుదీర్ఘ‌కాలం కాంగ్రెస్ పార్టీలో ఉండి, క‌ర్నూలులో బిగ్ షాట్‌గా పేరొందిన రాజ‌కీయ ప్ర‌ముఖుడు టి.జి.వెంక‌టేశ్‌కు అనూహ్యంగా టీడీపీ రాజ్య‌స‌భ టిక్కెట్ ద‌క్కింది. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులెవరన్న సస్పెన్సుకు తెరపడింది. సిట్టింగ్ సభ్యుడు సుజనా చౌదరి, టిజీ వెంకటేశ్‌లను పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా చంద్రబాబునాయుడు ఖరారు చేశారు. రాజ్యసభ అభ్యర్థుల ఖరారుపై ఈ ఉదయం నుంచీ సీనియర్ నాయకులు, ఆశావహులతో సుదీర్ఘంగా చర్చించిన ఆయన చివరకు సుజనా, టీజీ వెంకటేశ్‌ల పేర్లు ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
 
ఈ స్థానం కోసం టిజీ ఇటీవ‌లే త‌న ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. అస‌లు ఆయ‌న టీడీపీ తీర్థం తీసుకుని కూడా ఎక్కువ కాలం కాలేదు. కానీ, క‌ర్నూలులో టీజీకి ప‌ట్టుండ‌టం, ఒక సామాజిక వ‌ర్గానికి చెందిన వారు కావడం... మ‌రోప‌క్క ఆర్థికంగా కూడా టీజీ బ‌లంగా ఉండ‌టంతో ఆయ‌న అభ్యర్థిత్వంవైపే టీడీపీ త‌లొగ్గిన‌ట్లు క‌నిపిస్తోంది. టీజీ కోసం ఎస్సీ వర్గానికి చెందిన జె.ఆర్.పుష్ప‌రాజ్‌ను కూడా ప‌క్క‌న పెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఇకపోతే మూడో సీటును అనుకున్నట్లుగానే రైల్వేమంత్రి సురేష్ ప్రభుకు కేటాయించారు చంద్రబాబు.