మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 13 డిశెంబరు 2021 (13:32 IST)

మ‌రో కోడి క‌త్తి డ్రామా, బాత్రూమ్ బాబాయ్ గొడ్డ‌లివేటుకు రిహార్స‌ల్ ఇది!

టీడీపీ ఎమ్మెల్యేలు, ఉప ముఖ్య‌మంత్రులు సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై హ‌త్యా య‌త్నం జ‌రుగుతుంద‌ని వ‌రుస‌గా మాట్లాడ‌టం చూస్తే... ఇదేదో మరో కొత్త డ్రామాకు రిహార్స‌ల్ లా అనిపిస్తోంద‌ని, మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు అయ్య‌న్న‌పాత్రుడు అనుమానాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు.
 
 
నిన్న తోపుదుర్తి ప్ర‌కాశ్‌రెడ్డి, నేడు ఉప ముఖ్య‌మంత్రి నారాయ‌ణ‌స్వామి గారూ జ‌గ‌న్ రెడ్డి ప్రాణాల‌కు హాని త‌ల‌పెట్టొచ్చ‌ని తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేయ‌డం చాలా ముఖ్యంగా గ‌మ‌నించాల్సిన విష‌యం అని మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు అయ్య‌న్న‌పాత్రుడు అన్నారు. మ‌రో కోడి క‌త్తి డ్రామా, బాత్రూమ్ బాబాయ్ గొడ్డ‌లి వేటులా కొత్త ప‌న్నాగానికి ఇది రిహార్స‌ల్లాగా అనిపిస్తోంద‌న్నారు. ఓ వైపు అప్పుల కుప్ప‌, మ‌రోవైపు తీవ్ర‌మైన ప్ర‌జా వ్య‌తిరేక‌త‌తో, మ‌ళ్లీ కోడి క‌త్తికి సాన‌బెడుతూ, గొడ్డ‌లికి దారుబెడుతున్న  సంకేతాలు క‌నిపిస్తున్నాయ‌ని జోస్యం చెప్పారు. 
 
 
అబ్బాయ్ గారు... ఈ సారి ఏ బాబాయ్‌కి గురిపెట్టారో! తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల దుర్మార్గుడికి దూరంగా వుంటున్నా, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైఎస్ వివేకానంద రెడ్డి హత్య చెబుతోంది. బురద రాజకీయం మాని హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకు వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలి అంటూ మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు అయ్య‌న్న‌పాత్రుడు ట్వీట్ చేశారు.