శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : సోమవారం, 2 మార్చి 2015 (18:26 IST)

స్వామీ.. మోడీకి మంచి బుద్ధి ప్రసాదించు.. అలిపిరి వద్ద టిడిపి ఉపవాస దీక్షలు

ఆంధ్రప్రదేశ్ పట్ల మోడీ వ్యవహా శైలిని నిరసిస్తూ తిరుపతిలో తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టింది. అలిపిరి వద్ద ఉపవాస దీక్షలను చేపట్టారు. తెలుగుదేశం, టిటిడి విజిలెన్స్ విభాగానికి మధ్యన పెద్ద ఎత్తున వాగ్వాదం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం తిరుపతిలో జరిగిన ఈ ఆందోళన కార్యక్రమం వివరాలిలా ఉన్నాయి. 
 
ఆంధ్రప్రదేశ రాష్ట్రానికి ప్రధాన మంత్రి మోడీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ పెద్ద సోమవారం ఉదయం ఎత్తున ఆందోళనకు దిగింది. తిరుపతిలోని అలిపిరి సమీపంలోని పాదాల మండపం వద్దకు చేరుకుని ఉపవాస దీక్షలు చేపట్టారు. ముందుగా లోనికి పంపేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో తెలుగుతమ్ముళ్ళకు, విజిలెన్స్ విభాగానికి మధ్యన వాగ్వాదం చోటు చేసుకుంది.
 
తరువాత వేంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని పెట్టుకుని అక్కడే కూర్చుకున్నారు. మోడీకి మంచి బుద్ధిని ప్రసాదించాలని తిరుపతి రాక సందర్భంగా మోడీ ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మోడీ ఏరుదాటాక తెప్ప తగలేసి విధంగా వ్యహరిస్తున్నారని ఆరోపించారు. ఆయనకు మంచి బుద్ధిని ప్రసాదించి నిధులు కేటాయించేలా చూడాలని వేంకటేశ్వర స్వామిని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు నరసింహయాదవ్, ఆర్సి మునికృష్ణ, శ్రీధర్ వర్మ, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే సుగుణమ్మ వారికి నిమ్మరసం ఇచ్చి ఉపవాస దీక్షను విరమింప జేశారు.