Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జగన్‌ను నమ్మితే బిర్యానీ కాదు చిప్పకూడు ఖాయం.. పార్టీ భూస్థాపితమే: ఆర్‌.శ్రీనివాసరెడ్డి

మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (12:52 IST)

Widgets Magazine

పైడిపాళెంకు నీరొచ్చాక తెలంగాణ వదిలి నింపాదిగా కడప జిల్లాకు వచ్చి ప్రాజెక్టు వద్దకు వెళ్ళి మా తండ్రి పూర్తి చేశారని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదమని.. ఇలాంటి విపక్ష నేత జిల్లా వాసి కావడం ప్రజల దౌర్భాగ్యమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు.

తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమార్జన చేసి నేర పరిశోధన సంస్థలకు దొరికిపోయి ఐఏఎస్‌, ఐపీఎస్‌, పారిశ్రామిక వేత్తలను తనతో పాటు జైలుకు పంపించిన ఘనత జగన్‌దేనని వ్యాఖ్యానించారు. 
 
నీటి పారుదల అభివృద్ధి బోర్డు సమావేశాలకుకానీ, చివరకు జిల్లా పరిషత్‌ సమావేశాలకు కూడా హాజరు కాని జగన్‌ నీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. వాస్తవాలు ప్రజలకు బాగా తెలుసునని, ముఖ్యంగా ప్రాజెక్టులకు నీరు ఎవరి ద్వారా వస్తున్నాయో పులివెందుల ప్రజలకు మరింత తెలుసునని చెప్పారు. 
 
సొంత తల్లిపై పోటీ చేసిన చిన్నాన్నను ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిపి బిర్యానీ పెడతా... నాలుగు రెట్ల సంపాదన చూపిస్తానంటూ అమాయకులైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను వంచించేందుకు జగన్‌ జిల్లాలో పర్యటించారన్నారు. జగన్‌ను నమ్మితే బిర్యాని కాదు కదా జైలు చిప్పకూడు తినిపిస్తారని ఆరోపించారు. బాబు వల్లే పులివెందులకు సాగు నీరు వస్తున్న సంగతి ముమ్మాటికీ వాస్తవమని తెలుసుకున్న ప్రజలు జగన్‌ పార్టీని భూస్థాపితం చేస్తారన్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

నా పీఏను తక్షణం తొలగించండి.. చంద్రబాబును కోరిన బాలకృష్ణ

హిందూపురంలో టీడీపీ శ్రేణులను ఓ ఆట ఆడుకుంటున్న పీఏ శేఖర్‌ను తక్షణం తొలగించాలని సినీ నటుడు, ...

news

అమ్మను తోసేశారు.. శశికళ సీఎంగా వద్దే వద్దన్న పాండ్యన్-పన్నీర్‌కే మళ్లీ పట్టం అంటోన్నకేంద్రం

తమిళనాడులో ఏం జరుగుతోంది.? కేంద్రం ఎవరిపై మొగ్గుచూపుతుంది? ఒకటి రెండు రోజులు గవర్నర్ ...

news

దుస్తులు తీయించి.. గ్రౌండ్‌లో నిలబెట్టిన వీడియో తీసిన కీచక హెడ్మాస్టర్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కీచక ప్రధానోపాధ్యాయుడి అరాచకం వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో ...

news

పెద్ద నోట్ల రద్దు.. మోడీదే తప్పంతా.. భారతదేశం ఎటుపోతుందో?: స్టీవ్ హెచ్ హంకీ

పెద్ద నోట్ల రద్దు వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోదీపై అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు ...

Widgets Magazine