సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 21 ఫిబ్రవరి 2019 (19:51 IST)

తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థులు వీరేనా? కేఈ కృష్ణమూర్తికి మొండిచేయి?

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయనున్న అభ్యర్థులు వీరేనంటూ సోషల్ మీడియాలో ఓ జాబితా చక్కర్లు కొడుతోంది. ఆ జాబితాలోని పేర్లు పరిశీలిస్తే, చాలా స్థానాల్లో కొత్త వారికి అవకాశం కల్పించారు. అలాగే, పలువురు సిట్టింగ్‌లకు కూడా మళ్లీ టిక్కెట్లు కేటాయించారు. అలాగే, వివిధ కారణాల రీత్యా చనిపోయిన పార్టీ సీనియర్ నేతల తనయులకు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టిక్కెట్లు కేటాయించారు. ఆ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ వివరాలను పరిశీలిస్తే, 
 
కడప అసెంబ్లీ స్థానం నుంచి అష్రాఫ్, రాయచోటిలో రమేష్ రెడ్డి, రాజంపేటలో చెంగల రాయుడు, రైల్వ కోడూరులో నరసింహ ప్రసాద్, బద్వేల్‌లో లాజర్, మైదుకూరులో త్వరలో టీడీపీలో చేరనున్న డీఎల్ రవీంద్రా రెడ్డి, జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డి, పులివెందులలో సతీష్ రెడ్డి, కమలాపురంలో వీర శివారెడ్డి, తాడిపత్రిలో జేసి ప్రభాకర్ రెడ్డి లేదా ఆయన కుమారుడు, రాప్తాడులో పరిటాల సునీత, పుట్టపర్తిలో పల్లె రఘనాథరెడ్డి, ఉరవకొండలో పయ్యావుల కేశవ్, హిందూపురంలో నందమూరి బాలకృష్ణ, పత్తికొండవో కె.ఈ. కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యామ్, శ్రీశైలంలో బుడ్డ రాజశేఖర్, ఆళ్లగడ్డలో అఖిల ప్రియా రెడ్డి, నంద్యాలలో బ్రహ్మానంద రెడ్డి లేదా ఏవీ సుబ్బారెడ్డి, ఆదోనిలో మీనాక్షి నాయుడు, కుప్పంలో నారా చంద్రబాబు నాయుడు, పలమనేరులో అమర్నాథ్ రెడ్డి, పుంగనూరులో అనూష రెడ్డి, నగరిలో గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు, పీలేరులో నల్లూరి కిషోర్ కుమార్ రెడ్డి, శ్రీకాళహస్తిలో బొజ్జాల సుధీర్, నెల్లూరు సిటీలో పి.నారాయణ, సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోవూరులో పొలంరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆత్మకూరులో బొల్లినేని కృష్ణయ్య, పర్చూరులో ఏలూరి సాంబశివరావు, అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్, ఒంగోలులో దామంచర్ల జనార్దన్, దర్శిలో సిద్ధ రాఘవరావు, తెనాలిలో ఆలపాటి రాజేంద్రప్రసాద్, వేమూరులో నక్క ఆనంద్ బాబు, పొన్నూరులో ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, గురజాలలో యరపతినేని శ్రీనివాసరావులు ఉన్నారు. 
 
అలాగే, వినుకొండలో జి వి ఆంజనేయులు, చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావు, మైలవరంలో దేవినేని ఉమామహేశ్వరరావు, మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర, పెడనలో కాగిత వెంకట్రావు, విజయవాడ తూర్పులో గద్దె రామ్మోహన్ రావు, గన్నవరంలో వల్లభనేని వంశీ, పెనమాలూరులో బోడె ప్రసాద్, దెందులూరులో చింతమనేని ప్రభాకర్, ఏలూరులో బడేటి బుజ్జి, గోపాలపురంలో మద్దిపాటి వెంకట రాజు, తణుకులో ఆరిమిల్లి రాధ కృష్ణ, పాలకొల్లులో నిమ్మల రామానాయుడు, ఉండిలో శివ రామ రాజు, ఆచంటలో పితాని సత్యనారాయణ, జగ్గoపేటలో జ్యోతుల నెహ్రు, కొత్తపేటలో బండారు సత్యనoదం రావు, అనపర్తిలో నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి, ముమ్మిడివరంలో దాట్ల బుచ్చి రాజు, మండపేటలో జోగేశ్వర రావు, ప్రత్తిపాడులో పరుపుల రాజు, రాజోలులో బత్తిన రాము, పాయకరావుపేటలో అనిత, నర్సీపట్నంలో సీహెచ్ అయ్యన్నపాత్రుడు, విశాఖ ఈస్ట్‌లో వెలగపూడి రామకృష్ణ, భీమిలిలో గంట శ్రీనివాస్ రావు, అరకులో కిడారి శ్రవణ్ కుమార్, ముడుగులలో రామానాయుడు, పెందుర్తిలో బండారు సత్యనారాయణ మూర్తి, బొబ్బిలిలో సుజయ కృష్ణ రంగారావు, ఎస్ కోటాలో కోళ్లు లలిత కుమారి, రాజాంలో కొండ్రు మురళి, ఏర్చర్లలో కళా వెంకట్రావు, టెక్కిలిలో అచ్చెన్నాయుడు, పలాసలో గౌతు శిరీష్, రాయదుర్గంలో కాల్వ శ్రీనివాసులు, ధర్మవరంలో గోనుగుంట్ల సూర్యనారయణ, చంద్రగిరిలో పులివర్తి నానిలు పోటీ చేయనున్నారు.