Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నేను చచ్చాక.. దివాకర్ రెడ్డి అనేవాడు ఒకడున్నాడని చెప్పుకోవాలి: జేసీ

బుధవారం, 4 అక్టోబరు 2017 (07:26 IST)

Widgets Magazine
jc diwakar reddy

ఏపీ రాష్ట్ర మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ వివాహానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వచ్చారు. ఆ సమయంలో టీడీపీ అనంతపురం జిల్లా పయ్యావుల కేశవ్‌, సీఎం కేసీఆర్‌ల మధ్య కొన్ని నిమిషాలు ఏకాంత చర్చలు జరిగాయి. వీటిపై మీడియాలో పలు రకాల ఊహాగానాలు వినిపించాయి. 
 
ఈ నేపథ్యంలో వీరిద్దరి ఏకాంత చర్చలపై అనంతపురం ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. 'రహస్య మంతనాలని నేనైతే అనుకోను. మా అందరికీ కేసీఆర్ బాగా తెలుసు. మమ్మల్ని అందరినీ పేరుపెట్టి పిలుస్తాడు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు 'ఏమయ్యా, కేశవ్ ఎట్లా ఉన్నావు?' అంటూ భుజం మీద చేయి వేసుకుని అలా పక్కకుపోయాడు. అంతేగానీ, దానికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వడంలో అర్థం లేదు' అని జేసీ చెప్పుకొచ్చారు. 
 
ఇకపోతే... మా ప్రజలు బాగుండాలి, మేము బాగుండాలని తాను కోరుకుంటానని చెప్పారు. ‘నేను రాజకీయాల్లో ఉండి ఒక మంచి కార్యక్రమం చేయకపోతే ఎట్లా! నాకు ఒకటే ఆశ ఉంది.. మనం చచ్చిపోయిన తర్వాత, మనం పైకి పోయిన తర్వాత కూడా నాలుగైదు సంవత్సరాలు మన పేరు తలచుకునేటట్టు ఉండాలి. దివాకర్ రెడ్డి అనేవాడు ఉండేవాడు, ఫలానా పని చేసి పోయాడనే మంచిపేరు రావాలనేదే నా ఆశ’ అని చెప్పుకొచ్చారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు.. ఖాళీ అవుతున్న ఉత్తర కొరియా

ఉత్తర కొరియా ఖాళీ అవుతోంది. ఈ దేశంపై అమెరికా ఏ క్షణమైనా దాడులతో విరుచుకుపడే అవకాశం ...

news

చిన్నమ్మకు పెరోల్ తిరస్కరణ... చావుబతుకుల మధ్య భర్త.. ఎలా?

అక్రమాస్తుల కేసులో బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభిస్తున్న అన్నాడీఎంకే ...

news

ఒకే ఒక్క పిలుపుతో రెబల్ ఫ్యాన్స్ విజయవంతం చేశారు...

ఒకే ఒక్క పిలుపుతో ఉద్యమ స్థాయిలో ఉరకలెత్తి ఉభయ రాష్ట్రాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ...

news

పవన్ కళ్యాణ్‌వి పిల్ల చేష్టలా..? ఏపీ ప్రజలు నవ్వుకుంటున్నారా?

సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. సినిమాల్లో ఏది చేసినా చెల్లుబాటవుతుంటుంది. ఆట్టే పెద్దగా ...

Widgets Magazine