శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 27 జులై 2016 (09:42 IST)

రైతులను జైలలో పెట్టయినా ప్రాజెక్టులు నిర్మిస్తాం : మంత్రి తలసాని శ్రీనివాస్

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను ఆ రాష్ట్ర రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా ప్రాజెక్టుల కోసం సేకరించే భూముల వల్ల తీవ్రంగా నష్టపోయే రైతులు ఆందోళనబాట పట్టగా, వారికి విపక్ష

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను ఆ రాష్ట్ర రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా ప్రాజెక్టుల కోసం సేకరించే భూముల వల్ల తీవ్రంగా నష్టపోయే రైతులు ఆందోళనబాట పట్టగా, వారికి విపక్ష పార్టీలన్నీ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు  నెలకొన్నాయి. ప్రాజెక్టుల నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 
 
దీనిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, ప్రాజెక్టులు అడ్డుకుంటామంటే లోపలేసి తీరుతామన్నారు. ఇప్పుడు అరెస్టులు చేసి వదిలేస్తున్నట్టు చెప్పారు. రేపు కేసులు పెట్టి జైలుకు కూడా పంపిస్తాం. ప్రభుత్వం చేతులు కట్టుకుని కూర్చోదు. తాటాకు చప్పుళ్లకు భయపడం. ఆరునూరైనా ప్రాజెక్టులు నిర్మించి తీరుతామని తెలిపారు. 
 
ప్రాజెక్టులు కట్టొద్దా, రైతులు బాగుపడొద్దా? అని ప్రశ్నించారు. టీడీపీ డబుల్ గేమ్ ఆడుతోందన్నారు. మేజర్ ప్రాజెక్టులను నిర్మించాల్సి వస్తే కొంత నష్టం ఉంటుందని, బాధితులకు ఇబ్బంది ఉంటుందన్నారు. కానీ వారందరికీ న్యాయం చేస్తామని తలసాని హామీ ఇచ్చారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు డ్రామా కంపెనీలు ఏర్పాటు చేసుకొని నాట కాలాడుతున్నాయని.. వారికి రైతుల గురించి మాట్లాడే అర్హత ఎక్కడుందని ప్రశ్నించారు. 
 
కాంగ్రెస్‌లో ఉన్న 15 మందిలో ప్రతి ఒక్కరూ సీఎం అభ్యర్థులే కనుక ఆ పార్టీలో మనిషికో విధానం ఉంటుందని ఎద్దేవా చేశారు. కోదండరాం ఏ పార్టీకీ చెందినవారు కాదని, ఆయన ప్రజాప్రతినిధి కూడా కాదనీ.. ప్రభుత్వాన్ని నడిపిన అనుభవం లేదని వ్యాఖ్యానించారు. అయితే ఆయనకు మాట్లాడే స్వేచ్ఛ ఉందన్నారు. ఇక రైతులను లక్ష్యంగా చేసుకొని లాఠీచార్జి చేయడంపై పరిశీలిస్తామన్నారు.