శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 25 జనవరి 2017 (10:21 IST)

తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉప్పు తెగ తింటున్నారట.. పచ్చళ్లలో ఉప్పే ఉప్పు.. తగ్గించకుంటే గోవిందా

ఉప్పు తినాలి. కానీ మోతాదు మించకూడదంటారు వైద్యులు. అయితే తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు మాత్రం ఉప్పును తెగ లాగించేస్తున్నారట. అవును. ఇది నిజమే. రోజుకు కేవలం ఐదు గ్రాముల ఉప్పు మాత్రమే తీసుకోవాలని ప్రపంచ ఆ

ఉప్పు తినాలి. కానీ మోతాదు మించకూడదంటారు వైద్యులు. అయితే తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు మాత్రం ఉప్పును తెగ లాగించేస్తున్నారట. అవును. ఇది నిజమే. రోజుకు కేవలం ఐదు గ్రాముల ఉప్పు మాత్రమే తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్లు చేస్తే.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రజలు మాత్రం దానికి భిన్నంగా రోజుకు 9.45 గ్రాముల ఉప్పు తింటున్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
 
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు ఆహారంలో అధికంగా ఉప్పు వాడుతున్నారని అధ్యయనంలో తేలింది. అంతేకాదు.. పచ్చళ్లు, స్నాక్స్ రూపంలో తీసుకునే తెలుగు ప్రజలు దేశంలో అత్యధికంగా ఉప్పు తీసుకునే వారి జాబితాలో చేరిపోయారని తాజా అధ్యయనంలో వెల్లడి అయ్యింది. గత ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల్లో 758 మందిని సర్వే చేయగా ఉప్పు పలు ఆహారపదార్థాలను నిల్వ చేసేందుకు వినియోగిస్తున్నారని తేలింది. 
 
ఇకపోతే... జాతీయ ఉప్పు వినియోగం తగ్గించే కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా ఆహారంలో ఉప్పు వినియోగాన్ని తగ్గించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఆహారంలో అధికంగా ఉప్పు తీసుకోవడం వల్ల గుండెపోటు, పక్షవాతం, కిడ్నీ వ్యాధులు వచ్చే ప్రమాదముందని వారు హెచ్చరిస్తున్నారు. అందుచేత తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు ఉప్పు అధికంగా తీసుకునే ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని వైద్యులు సూచిస్తున్నారు.