తిరుమల వేదపండితులు గొడవ పడ్డారు... అదీ సిఎం ముందే...
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలంటే అందరికీ పండుగే. ప్రతి యేటా బ్రహ్మోత్సవాలకు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పిస్తూనే వస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అయితే పట్టువస్త్రాలను సమర్పించే సమయంలో తల
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలంటే అందరికీ పండుగే. ప్రతి యేటా బ్రహ్మోత్సవాలకు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పిస్తూనే వస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అయితే పట్టువస్త్రాలను సమర్పించే సమయంలో తలపాగా చుట్టేందుకు ఇద్దరు వేదపండితులు పోటీలు పడ్డారు. అది కూడా ఒకరు ప్రధాన అర్చకులు, మరొకరు కంకరభట్టాచార్యులు.
ప్రతియేటా స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించే వారికి ఆలయ ప్రధాన అర్చకులు రమణదీక్షితులే తలకు పాగా కడుతారు. అలాంటిది ఈసారి తల పాగా కట్టేందుకు కంకరభట్టాచార్యులు వేణుగోపాల్ దీక్షితులు ముందుకు వచ్చారు. తలపాగా కట్టేందుకు ప్రయత్నించారు. దీంతో రమణదీక్షితులు తలపాగాను తీసుకొని చంద్రబాబుకు చుట్టారు. దీంతో వేణుగోపాల్ దీక్షితులు పక్కకు వెళ్ళిపోయారు.
తలపాగా చుట్టిన తరువాత రమణదీక్షితులు ఇది నేనే కట్టాలన్న విధంగా వేణుగోపాల్ వైపు చూశాడు. ఇద్దరు ఒకరినొకరు చూసుకోవడంతో మిగిలిన పండితులు వారిని తధేకంగా గమనించారు. అయితే సిఎం పట్టువస్త్రాలను ఇచ్చేందుకు బయలుదేరుతుండగా వెంటనే రమణదీక్షితులు కూడా ఆయనతో పాటు వచ్చేశారు. దీంతో సమస్య సద్దుమణిగింది కానీ వీరిద్దరు తలపాగా కట్టేందుకు పోటీలు పడటం మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.