సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 23 జనవరి 2018 (14:10 IST)

పెళ్లి చేస్కుంటానని లొంగదీసుకున్నాడు... కేసు పెడితే పోలీసులు అలా చేశారు(వీడియో)

తనను ప్రేమ పేరుతో మోసం చేసి లొంగదీసుకున్న ఓ యువకుడు పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేశాడని పోలీసులను ఆశ్రయించింది ఓ యువతి. తిరుపతిలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలను చూస్తే... తను ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా తనతో ఓ యువకుడు పరిచయం పెంచుకున్నాడనీ,

తనను ప్రేమ పేరుతో మోసం చేసి లొంగదీసుకున్న ఓ యువకుడు పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేశాడని పోలీసులను ఆశ్రయించింది ఓ యువతి. తిరుపతిలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలను చూస్తే... తను ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా తనతో ఓ యువకుడు పరిచయం పెంచుకున్నాడనీ, ప్రేమ పేరుతో తనను నమ్మించి లొంగదీసుకున్నాడని సదరు యువతి ఆరోపిస్తోంది. 
 
అతడితో గత కొన్ని నెలలుగా పలుమార్లు కలిశాననీ, అయితే పెళ్లి మాటెత్తగానే తప్పించుకు తిరుగుతున్నాడని తెలిపింది. అతడి బుద్ధి తెలుసుకుని పోలీసులను ఆశ్రయిస్తే అతడిని ఎలాంటి విచారణ లేకుండా 420 కేసు కింద అరెస్టు చేసి జైల్లో పెట్టారనీ, ఐతే తనకు అతడితో పెళ్లి చేయాలని తను కోరితే పోలీసులు మాత్రం అతడ్ని జైల్లో వేసి తనకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. చూడండి ఆమె మాటల్లోనే వీడియోలో...