శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ttdj
Last Updated : ఆదివారం, 22 జనవరి 2017 (12:50 IST)

తిరుపతి వెళుతున్నారా.. అయితే తోపుడు బండ్ల వద్దకు వెళ్ళొద్దండి...! ఎందుకు?

మీరు తిరుపతి వస్తున్నారా... అయితే తోపుడు బండ్లపై ఉన్న ఆహారాన్ని మాత్రం తినకండి. తక్కువ డబ్బని ఒక్కసారి కమిటయ్యారంటే ఇక వారంరోజుల పాటు ఆసుపత్రి చుట్టూ తిరగాల్సిందే. తిరుమల తిరుపతి దేవస్థానం వసతి సముదాయ

మీరు తిరుపతి వస్తున్నారా... అయితే తోపుడు బండ్లపై ఉన్న ఆహారాన్ని మాత్రం తినకండి. తక్కువ డబ్బని ఒక్కసారి కమిటయ్యారంటే ఇక వారంరోజుల పాటు ఆసుపత్రి చుట్టూ తిరగాల్సిందే. తిరుమల తిరుపతి దేవస్థానం వసతి సముదాయాల వద్ద ఉన్న తోపుడ బండ్లపై రెండు, మూడురోజుల ముందు వండిన ఆహారాన్ని భక్తులకు పెడుతూ వారిని అనారోగ్యం పాలు చేస్తున్నారు.
 
తిరుపతి. ఈ పేరు తెలియని వారుండదు. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన హిందూ క్షేత్రాల్లో తిరుపతి ఒకటి. ప్రతిరోజు 50 వేలమందికిపైగా భక్తులు తిరుపతికి వస్తుంటారు. అయితే భక్తుల జేబులకు చిల్లులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు తోపుడు బండ్ల యజమానులు. తిరుపతిలోని టిటిడి వసతి సముదాయాల సమీపంలో తోపుడు బండ్లను ఏర్పాటు చేసి అపరిశుభ్ర వాతావరణంలో భక్తులకు భోజనాలను పెడుతున్నారు. 
 
ప్రధానంగా శ్రీనివాస సముదాయాల ఎదురుగా ఉన్న తోపుడు బండ్లపై రెండు, మూడు రోజుల క్రితం వండిన వాటిని వేడి చేసి భక్తులకు ఇచ్చేస్తున్నారు. తక్కువ రేటని చాలామంది భక్తులు తోపుడు బండ్లపై ఉన్న వాటిని భుజించేస్తున్నారు. దీంతో భక్తులు అనారోగ్యం పాలవుతున్నారు. తోపుడు బండ్లపై తిన్న ఆహారం రెండు గంటల తరువాత భక్తులకు వాంతులు, విరోచనాలు అవుతున్నాయి. దీంతో ఆసుపత్రికి పరుగులు తీస్తున్నారు. 
 
కలుషితం ఆహారం తిని అస్వస్థతకు గురైన భక్తులు లేకపోలేదు. కొంతమంది భక్తులు గొడవెందుకులేనని చెప్పి వెళ్ళిపోతుంటారు. కానీ కొంతమంది భక్తులు తోపుడు బండ్ల యజమానులతో మాట్లాడడానికి వెళ్ళగా వారు భక్తులపైనే తిరగబడుతున్నారు. మీ ఇష్టం వచ్చిన వారికి చెప్పుకోండంటూ బెదిరిస్తున్నారు. దీంతో భక్తులు ఏమీ చేయలేక వెనుదిరుగుతున్నారు. ఇది ఇప్పటిది కాదు ఎన్నో నెలలుగా కొనసాగుతోంది. తిరుపతి నగర పాలక సంస్థలోని ఆరోగ్య విభాగం అధికారులు ఆమ్యామ్యాలు అలవాటు పడడంతో తోపుడు బండ్ల యజమానుల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతున్నాయి.