ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : సోమవారం, 8 నవంబరు 2021 (10:33 IST)

ఆంధ్ర ప్రదేశ్ కు పొంచి ఉన్న ముప్పు

ఉపరితల ఆవర్తనం కారణంగా ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరో వైపు ఈనెల 9న అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో వాతావరణ శాఖ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు హెచ్చరికలు జారీ చేసింది.
 
ఇప్పటికే అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం చిత్తూర్, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.
 
అల్పపీడన ప్రభావంతో రానున్న నాలుగు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి.
 
కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చిరిస్తోంది. ఈనెల 10న అల్పపీడన ప్రభావంతో నెల్లూరు, కడప, గుంటూర్ జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుందని వెల్లడించింది.
 
దీంతో ఈ జిల్లాల్లో రెడ్ అలెర్ట్ జారీ చేశారు. 11న నెల్లూరు, చిత్తూరు, కడప, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాలకు భారీ వర్ష సూచనలు చేసింది వాతావరణ శాఖ. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చిరికలు జారీ చేశారు.