సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 9 నవంబరు 2021 (14:01 IST)

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నకలకు మంగళవారం నోటిఫికేషన్ విడుదలైంది. ఎమ్మెల్యే కోటా కింద మొత్తం 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. దీనికోసం ఎన్నికల సంఘం మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. 
 
ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించే అభ్యర్థుల నుంచి ఈ నెల 16 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. వీటిని 17వ తేదీన పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఈ నెల 22గా ఉంది. 
 
పోటీ ఉంటే ఈ నెల 29న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఎన్నికలు నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది.
 
కాగా, రాష్ట్రంలోని ఆకుల లలిత, మహ్మద్ ఫరీదుద్దీన్, గుత్తా సుఖేందర్ రెడ్డి, నేతి విద్యాసాగర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరిల ఎమ్మెల్సీ పదవీకాలం ఈ ఏడాది జూన్ 3వ తేదీనే ముగిసింది. 
 
అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణను ఈసీ వాయిదా వేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం ఈ నవంబర్ లో ఎన్నికలు జరుగనున్నాయి.