సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 7 నవంబరు 2021 (14:31 IST)

రికార్డు స్థాయిలో టమోటా ధర

ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా టమోటా ధరలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. ఈ ధర ఏకంగా రూ.70 నుంచి 80 వరకు పలుకుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో టమోటా దిగుబడి బాగా తగ్గిపోయింది. దీంతోపాటు.. డిమాండ్ పెరగడంతో టమోటా ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. 
 
ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గడం, భారీ వర్షాలకు పంటలు దెబ్బతినడం కారణంగా టమాటా ధరలు భారీగా పెరిగాయి. కొత్త పంట చేతికొచ్చే వరకు పరిస్థితి ఇలానే ఉండేలా కన్పిస్తోంది. అంటే నవంబర్ నెలాఖరు వరకు వంటింట్లో టమాటా కన్పించక పోవచ్చు. ప్రస్తుతం మదనపల్లి మార్కెట్‌కు 150 మెట్రిక్ టన్నుల టమాటో దిగుమతి అవుతోంది. 
 
ఈ మార్కెట్‌లో కిలో టమాటా 74 రూపాయల వరకు పలుకుతోంది. అన్‌సీజన్‌లో అత్యధిక ధర నమోదైంది. గత నాలుగేళ్లుగా అన్‌సీజన్‌లో ఇదే అత్యధిక ధరని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పెద్దగా టమాటా దిగుబడులు లేకపోవడంతో ధరలకు రెక్కలొచ్చాయి.