శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: శుక్రవారం, 6 ఏప్రియల్ 2018 (13:39 IST)

తిరుమల శ్రీవారిని తనివితీరా దర్శించే అద్భుత అవకాశం...

ప్రతినెలా ఆర్జిత సేవలను ఆన్ లైన్‌లో విడుదల చేస్తూ సాధారణ భక్తులకు సేవలను దగ్గర చేస్తోంది టిటిడి. ఈసారి కూడా ఆన్‌లైన్ లో భక్తులకు అవసరమయ్యే సేవలను విడుదల చేసింది. అధిక సంఖ్యలోనే సేవా టిక్కెట్లను పొందే అవకాశాన్ని భక్తులకు కల్పిస్తోంది. మొత్తం 58,419 సే

ప్రతినెలా ఆర్జిత సేవలను ఆన్ లైన్‌లో విడుదల చేస్తూ సాధారణ భక్తులకు సేవలను దగ్గర చేస్తోంది టిటిడి. ఈసారి కూడా ఆన్‌లైన్ లో భక్తులకు అవసరమయ్యే సేవలను విడుదల చేసింది. అధిక సంఖ్యలోనే సేవా టిక్కెట్లను పొందే అవకాశాన్ని భక్తులకు కల్పిస్తోంది. మొత్తం 58,419 సేవా టిక్కెట్లను విడుదల చేసింది టిటిడి.
 
సుప్రభాతం 6,979, తోమాల సేవ 110, అర్చన 110, అష్టదళ పాదపద్మారాధన సేవ 120, నిజపాద దర్శనం 2,300, విశేష పూజ 1000, కళ్యాణం 12,350, డోలోత్సవం 3,900, ఆర్జిత బ్రహ్మోత్సవం 7,150, వసంతోత్సవం 8,800, సహస్త్ర దీపార్చన 15,600 టిక్కెట్లను ఆన్ లైన్‌లో విడుదల చేసింది. ఆన్‌లైన్‌లో సేవా టిక్కెట్లను పొంది కేటాయించిన సమయాల్లో శ్రీవారిని దర్శించుకోవాలంటున్నారు టిటిడి అధికారులు.