గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 మార్చి 2022 (15:31 IST)

అమరావతిలో విషాదం: భవనం విరిగి పడటంతో ఇద్దరు మృతి

అమరావతిలో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ భవనం విరిగి పడడంతో మట్టి పెళ్ళలు కింద చిక్కుకుని ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇంకా శిథిలాల కింద ముగ్గురు కార్మికులు చిక్కుకున్నారు. 
 
రాడ్ బెండింగ్ వర్క్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరుగుతుందని ముందే గ్రహించిన ఇద్దరు కార్మికులు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం తెలుసుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. 
 
దీనిపై దర్యాప్తు జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని, చనిపోయిన వారి కుటుంబానికి ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందజేస్తామని అధికారులు హామీనిచ్చారు.