శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi

కాంగ్రెస్ వాళ్లు కూడా ప్రధాని మోడీని విమర్శిస్తే ఎలా?: వెంకయ్య నాయుడు

దేశంలో పెద్ద నోట్ల రద్దుతో ఆర్థిక ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ... అవి తాత్కాలికమేనని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఆయన ఆదివారం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాన్ని అ

దేశంలో పెద్ద నోట్ల రద్దుతో ఆర్థిక ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ... అవి తాత్కాలికమేనని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఆయన ఆదివారం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాన్ని అర్థం చూసుకోకుండా కాంగ్రెస్ నేతలు కూడా విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
పెద్ద నోట్ల రద్దు మోడీ తీసుకున్నది ఆకస్మిక నిర్ణయమేనని, అది అలాగే చేయాలని ఆయన అన్నారు. ముందే కొత్త నోట్లు విడుదల చేయాల్సిందని అంటున్నారని, కానీ పాత నోట్లు ఉప సంహరణ అయితేనే కొత్తవి వస్తాయని, అది ఆర్బీఐ నిబంధన అని, అవినీతి జబ్బుకు మోడీ చికిత్స చేస్తున్నారని వెంకయ్య అన్నారు.
 
ఇకపోతే.. చట్టబద్ధంగా సంపాదించిన వారు భయపడాల్సిన అవసరం లేదని, ప్రజలను భయపెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, వారి మాటలను నమ్మవద్దని అన్నారు. ప్రధానమంత్రి స్వచ్ఛభారతాన్ని నిర్మాణం చేయాలని పెద్ద యజ్ఞాన్ని దేశంలో ప్రారంభిచారని చెప్పారు. ప్రధాని మొదటి నుంచి నల్లధనం నిర్మూలన కోసం కృషి చేస్తున్నారని, దీనికోసం ప్రత్యేక కమిటీని నియమించారని, ఆ విధంగా స్వచ్ఛభారత్ అనేది అంచెలంచెలుగా మోడీ అమలు చేస్తున్నారన్నారు. 
 
రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేస్తూ చేసిన ప్రకటనను దేశ ప్రజలంతా హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నారని... అవినీతిపరులు, స్వార్థపరులు, స్మగ్లర్లు, టెర్రరెస్టులు, తీవ్రవాదులు తదితరులు దీనిని వ్యతిరేకిస్తున్నారని, కొన్ని రాజకీయ పార్టీలు కూడా మనస్ఫూర్తిగా స్వాగతించలేకపోతున్నాయని ఆయన విమర్శించారు. ఒక మంచి సంస్కరణ వచ్చినప్పడు కొన్ని తాత్కాలిక ఇబ్బందులు తప్పవని ఆయన చెప్పుకొచ్చారు.