శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: గురువారం, 24 మే 2018 (21:17 IST)

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం రూ. 237.53 కోట్ల రాయల్టీ విడుదల...

న్యూఢిల్లీ: కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి 2018-19 ఆర్ధిక సంవత్సరంలో విడుదల చేయవలసిన రాయల్టీ బకాయి 237.53 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులను జారీ చేసి

న్యూఢిల్లీ:  కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి 2018-19 ఆర్ధిక సంవత్సరంలో విడుదల చేయవలసిన రాయల్టీ బకాయి 237.53 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులను జారీ చేసినట్లు ఆంధ్ర ప్రదేశ్ భవన్ రెసిడెంట్ కమీషనర్ ప్రవీణ్ ప్రకాష్ తెలియచేశారు. 
 
రాష్ట్రానికి రావలసిన రాయల్టీ బకాయిలు ఏటా సెప్టెంబర్, అక్టోబర్ మాసాలలో విడుదల చేస్తుండగా సంబంధిత కేంద్ర అధికారులతో చర్చిస్తూ నిరంతర పర్యవేక్షణ చేయటంతో ఈ సంవత్సరం రాష్ట్రానికి రావలసిన రాయల్టీ బకాయిలను మే నెలలోనే విడుదల చేయుట జరిగిందని ఆంధ్రప్రదేశ్ భవన్ రెసిడెంట్ కమీషనర్ ప్రవీణ్ ప్రకాష్ పేర్కొన్నారు.